ముప్పై యేళ్ల కిందట వివాహం.. యేడేళ్లుగా లైంగిక వేధింపులు.. చిత్రహింసలు.. గొడ్డలితో భర్తను నరికి చంపిన భార్య..

Published : Jan 07, 2022, 10:37 AM IST
ముప్పై యేళ్ల కిందట వివాహం.. యేడేళ్లుగా లైంగిక వేధింపులు.. చిత్రహింసలు.. గొడ్డలితో భర్తను నరికి చంపిన భార్య..

సారాంశం

భార్య దగ్గరికి రానివ్వక పోవడంతో Extramarital affair ఉందని ఆరోపిస్తూ గొడ్డలి కర్రతో కొట్టాడు. ఆమె గ్రామంలోని కుమార్తె ఇంటికి వెళ్లింది. మరోసారి పెద్దలు నచ్చజెప్పడంతో తిరిగి వచ్చింది. బుధవారం రాత్రి మరోసారి లైంగికంగా వేధించాడు. అర్థరాత్రి తరువాత మరోసారి సతాయించగా ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో తన కోరిక తీర్చలేదన్న అక్కసుతో.. ఆమె బయటకు వెళ్లే మార్గం లేకుండా ఇంటికి గడియ వేసి, గొడ్డలి కర్రతో ఎల్లయ్య మళ్లీ దాడి చేశాడు.

చిన్న కోడూరు : భార్య మనసు గ్రహించకుండా పడకగదిలో Sexually torturedలు పెడుతున్న భర్త తీరుతో విసిగిపోయి.. చివరికి అతన్ని కడతేర్చింది ఓ wife. భార్య అంటే ఆమెకు ఇష్టాయిష్టాలు ఉంటాయని అర్థం చేసుకోలేని మూర్ఖత్వం చదువుకోని వారికే కాదు.. చదువుకున్న వారిలోనూ కనిపిస్తుంటుంది. 

ముఖ్యంగా Sexual desireల విషయంలో వారి ఇష్టాఇష్టాలను అస్సలు పరిగణలోకి తీసుకోరు. తమకు కావాల్సినప్పుడు.. కావాల్సినట్టు భార్య పడి ఉండాలని భావిస్తారు. దీనికి వయసుతో సంబంధం లేదు. పెళ్లై, పిల్లలు పుట్టి వారి పెళ్లిళ్లు చేసినా.. మహిళలకు సంసారంలో ఈ హింస తప్పడం లేదు. ఒప్పుకోకపోతే శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తూ... అనుమానాలతో వేధిస్తూ నరకయాతన చూపిస్తున్నారు. 

అలాంటి ఘటనే ఇది. ఆ చిత్రహింసలు తట్టుకోలేక.. క్షణికావేశం, భయాందోళనలో భర్తను గొడ్డలితో నరికి చంపింది ఓ భార్య. ఈ ఘటన Siddipet Districtలో గురువారం తెల్లవారుజామున జరిగింది. చిన్న కోడూరు మండలం విఠలాపూర్ గ్రామానకి చెందిన మర్కంటి ఎల్లయ్య (55), నర్సవ్వ (50) దంపతులు. ముప్పై యేళ్ల కిందట వివాహం అయ్యింది. 

ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారి కుమార్తె రేణుకకు గ్రామంలోనే ఇచ్చి ఏడేల్ల క్రితం పెళ్లి చేశారు. Wife and husbands మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. నర్సవ్వను ఆమె భర్త గత యేడేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. శారీరకంగా కలవాలంటూ తరచూ గొడవపడుతూ ఇష్టారీతిన కొట్టేవాడు. చిన్నపాటి కారణాలకు చితకబాడేవాడు. మూడు నెలల క్రితం కూర సరిగా వండలేదని బాదాడు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని గొడవ సద్దు మణిగేలా సర్దిచెప్పారు. 

గత సోమవారం భార్య దగ్గరికి రానివ్వక పోవడంతో Extramarital affair ఉందని ఆరోపిస్తూ గొడ్డలి కర్రతో కొట్టాడు. ఆమె గ్రామంలోని కుమార్తె ఇంటికి వెళ్లింది. మరోసారి పెద్దలు నచ్చజెప్పడంతో తిరిగి వచ్చింది. బుధవారం రాత్రి మరోసారి లైంగికంగా వేధించాడు. అర్థరాత్రి తరువాత మరోసారి సతాయించగా ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో తన కోరిక తీర్చలేదన్న అక్కసుతో.. ఆమె బయటకు వెళ్లే మార్గం లేకుండా ఇంటికి గడియ వేసి, గొడ్డలి కర్రతో ఎల్లయ్య మళ్లీ దాడి చేశాడు.

ఆ తరువాత అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అతనితో విసిగిపోయిన నర్సవ్వ.. శారీరర హింసను భరించలేక అక్కడే ఉన్న గొడ్డలితో భర్త మెడపైన వేటు వేసింది. ఫలితంగా ఎల్లయ్య అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఆ తరువాత తెల్లవారుజామున స్థానికులు ఈ విషయాన్ని గమనించారు. వెంటనే ఊర్లోనే ఉన్న కుమార్తె కుటుంబానికి సమచారం చేరవేశారు. వారు వచ్చి రక్తపు మడుగులో ఉన్న ఎల్లయ్యను చూసి హతాశులయ్యారు.

సీఐ సురేందర్ రెడ్డి, ఎస్ ఐ రాజేశ్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అక్కడే ఉన్న నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో ఆమె ఏడుస్తూ.. యేడేళ్లుగా తాను అనుభవించిన నరకం, ఎదుర్కొన్న కష్టాలను, ఎన్నిసార్లు తన మీద హత్యాయత్నం చేసింది.. ఆవేదనాభరితంగా వివరించింది. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Heat Wave Alert : ఈ ఎండలు ట్రైలర్ మాత్రమే.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ | Weather | Asianet News Telugu
TGPSC Notification : తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. నెలకు రూ.1,24,150 శాలరీతో ప్రభుత్వ ఉద్యోగం