వరంగల్ లో దారుణం.. 16 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన కీచక తండ్రి.. అరెస్ట్..

Published : Feb 16, 2023, 11:03 AM IST
వరంగల్ లో దారుణం.. 16 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన కీచక తండ్రి.. అరెస్ట్..

సారాంశం

కన్నూమిన్నూ కానని మైకంలో సొంత కూతురిమీదే అత్యాచారం చేశాడో తండ్రి. పదే పదే అత్యాచారం చేయడంతో ఆ పదహారేళ్ల బాలిక గర్భం దాల్చింది. 

వరంగల్ : వరంగల్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వరంగల్ జిల్లా మిల్స్ కాలనీలో  మైనర్ బాలికపై తండ్రి అత్యాచారానికి ఒడిగట్టాడు. 16 ఏళ్ల కుమార్తె మీద అత్యాచారానికి పాల్పడి, ఆమెను గర్భవతిని చేశాడో కామాంధుడైన తండ్రి. ఆ కీచక తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. మైనర్‌ బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యలు గర్బవతి అని చెప్పడంతో..  ఘటన వెలుగులోకి వచ్చింది.

మిల్స్ కాలనీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు గత నెల రోజులుగా మైనర్‌ అయిన కూతురు మీద పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకున్న తల్లి తన బిడ్డను గట్టిగా ప్రశ్నించగా ఆమ అసలు విషయం తెలిపింది.తన తండ్రి మత్తులో ఉన్నప్పుడు  తనను చాలాసార్లు లైంగికంగా వేధించాడని వెల్లడించింది.

హైద్రాబాద్ రాజేంద్రనగర్‌లో గుర్రపుస్వారీ బెట్టింగ్ : 13 మంది అరెస్ట్

ఈ లైంగిక దాడి గురించి ఎవరికైనా చెబితే.. మీ అమ్మను చంపేస్తానని బెదిరించాడని, భయపడి ఎవ్వరికీ చెప్పలేదని ఆమె పేర్కొంది. దీంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతని మీద  ఐపీసీ సెక్షన్ 376 (రేప్), పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఆ కీచకతండ్రిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపును కాపాడేందుకు వివరాలు వెల్లడించలేదు)

PREV
click me!

Recommended Stories

Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే
Revanth Reddy Full Speech At Nakirekal Meeting | Asianet News Telugu