కన్న కూతురి మీద కర్కశంగా ప్రవర్తించాడో తండ్రి.. భార్య ఇంట్లో లేని సమయంలో కూతురి మీద లైంగిక దాడికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ కేసులో అతనికి చనిపోయేవరకు జైలుశిక్ష విధించింది కోర్టు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఓ అత్యాచార కేసులో తండ్రికి మరణించేవరకు కారాగార శిక్ష విధించారు. కూతురి మీద లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి ఈ మేరకు శిక్షవిధిస్తూ శుక్రవారం కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి వివరాలు ఇలా తెలిపారు.. హైదరాబాద్ ఫిలింనగర్ కూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల క్రితం బతుకుతెరువు కోసం వలస వచ్చింది.
భార్య స్థానికంగా ఇళ్లల్లో పని చేసుకుంటుంది. భర్త కాపలాదారుగా పనిచేస్తున్నాడు. ఇద్దరి సంపాదనతో కుటుంబాన్నినెట్టుకొస్తున్నారు. వీరికి 14 ఏళ్ల కూతురు, ఓ కొడుకు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని హాస్టల్లో కొడుకునుపెట్టి చదివిస్తున్నారు. కూతురిని మాత్రం తమతోనే ఉంచుకున్నారు. 2021 జూలైలో కూతురు ఉన్నట్టుండి ఒక్కసారిగా వాంతులు చేసుకుంటుండడంతో.. అస్వస్థతకు గురైందని తల్లి ఆమెను నాంపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించింది.
బిడ్డలాంటిదానితో ఐలవ్యూ అంటాడా?... ఎమ్మెల్యే రాజయ్యపై జానకీ పురం సర్పంచి నవ్య వేధింపుల ఆరోపణలు..
అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే నాలుగు నెలల గర్భవతి అని చెప్పారు. ఆ విషయం తెలిసిన తల్లి షాక్ అయింది. కూతురిని తీవ్రంగా మందలించి ఏం జరిగిందో తెలుస్తుంది. ఈ క్రమంలో వెలుగు చూసిన వాస్తవాలు తల్లిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసాయి. తల్లి పనికి వెళ్ళిన సమయంలో తండ్రి తను తినే భోజనంలో నిద్రమాత్రలు కలిపే వాడని.. అది తిన్న తను నిద్ర పోయిన తర్వాత తన మీద లైంగిక తాడికి పాల్పడేవాడని ఆమె చెప్పింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని తండ్రి బెదిరించాడని ఆమె తల్లికి చెప్పింది.
అయితే కూతురిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన సమయంలోనే తన విషయం తెలిసిపోతుందని ఆ కామాంధుడైన తండ్రికి అర్థమయిపోయింది. భార్య, కూతురు ఆసుపత్రి నుంచి వచ్చేసరికే పరారయ్యాడు. దీంతో.. ఆ తల్లి కూతుర్ని తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు నమోదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, తండ్రిని అరెస్టు చేశారు. రిమాండ్కు పంపించారు. ఈ కేసును నాంపల్లిలోని 12వ అదనపు ఎంఎస్ జె కోర్టు విచారించింది. న్యాయమూర్తి అనిత కేసును విచారించి నిందితుడికి మరణించేవరకు కారాగారా జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధించారు. అంతేకాదు బాలికకు మెట్రో లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా రూ.7లక్షలు సహాయం చేయాలని ఆదేశించారు.