మంచిర్యాలలో కోడలి గొంతుకోసి హత్య చేసిన మామ.. !!

By SumaBala Bukka  |  First Published Jan 3, 2022, 5:02 PM IST

పెళ్లి అయిన 2 నెలలకే సాయికృష్ణ Suicide చేసుకున్నాడు. భర్త మృతి తర్వాత సౌందర్య అదే గ్రామంలో ఉంటున్న తన తల్లి వద్దే ఉంటుంది. ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో మామ తిరుపతి సౌందర్యను గొంతుకోసి హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


కోటపల్లి : Manchiryala జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని కోటపల్లి మండలం లింగన్నపేటలో కోడలు సౌందర్య (19) గొంతు కోసి కిరాతకంగా Murder చేశాడు మామ తిరుపతి. ఐదు నెలల క్రితం తిరుపతి కుమారుడు సాయికృష్ణతో సౌందర్య వివాహం జరిగింది. సాయికృష్ణను సౌందర్య Love marriage చేసుకుంది. 

పెళ్లి అయిన 2 నెలలకే సాయికృష్ణ Suicide చేసుకున్నాడు. భర్త మృతి తర్వాత సౌందర్య అదే గ్రామంలో ఉంటున్న తన తల్లి వద్దే ఉంటుంది. ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో మామ తిరుపతి సౌందర్యను గొంతుకోసి హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Latest Videos

undefined

ఇదిలా ఉండగా, ఓ మామ తన కోడలు తన ప్రైవసీకి భంగం కలిగించిందంటూ పోలీసులను ఆశ్రయించాడు. నిరుడు అక్టోబర్ లో జరిగిన ఈ ఘటన పోలీసులకు సవాల్ గా మారింది. హైదరాబాద్ పోలీసులకు ఓ విచిత్రమైన కేసు తగిలింది. ఓ 79 ఏళ్ల వ్యక్తి తన కోడలు తనపై నిఘా పెట్టిందంటూ సైబర్ క్రైమ్ బృందాన్ని ఆశ్రయించాడు. మొదట్లో అతని వాదనపై సందేహం వ్యక్తం చేసిన పోలీసులు ఆ తరువాత దర్యాప్తు మొదలుపెట్టారు. 

ఈ దర్యాప్తులో వారికి ఆశ్చర్యం కలిగించే విషయం తెలిసింది. సదరు కోడలు ఆ వ్యక్తి ఫోన్‌లో కాల్ రికార్డింగ్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి ఫోన్ కాల్స్ అన్నీ వింటోందని తెలిసింది. తన phone లో ఇలా జరగుతుందని అతనికి అనుమానం వచ్చి.. పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు వైకుంఠం కరీంనగర్‌కు చెందిన bussinessman. అతనికి నలుగురు కుమారులు ఉన్నారు. కాగా, అతను తన తన భార్యతో కలిసి రెండవ కుమారుడు (45) కుటుంబంతో కరీంనగర్‌లో ఉంటున్నాడు.

తెలంగాణలో Lockdownపై క్లారిటీ ఇచ్చిన డీహెచ్ శ్రీనివాసరావు.. ఆయన ఏం చెప్పారంటే..

గత కొన్నేళ్లుగా, అతని రెండవ కోడలు (40) property distribute చేయాలని పట్టుబడుతోందని, ఆస్తిపంపకాలు చేస్తే తను, తన భర్త విడిగా ఉండొచ్చని గొడవ చేస్తుందని వైకుంఠం తెలిపాడు. అయితే, ఆస్తిని విభజించడానికి వైకుంఠం, అతని భార్య అంగీకరించలేదు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితం వైకుంఠం రెండో కోడలు తను పర్సనల్ గా మాట్లాడిన మాటలను ఇతర కుటుంబసభ్యులతో సంభాషిస్తూ ఎద్దేవా చేయడం గమనించాడు. దీంతో తను ఫోన్ లో మాట్లాడేది ఆమె వింటుందని అతనికి అర్థం అయ్యింది. దీంతో కోడలిని అనుమానించినట్లు సైబర్ క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కెవిఎం ప్రసాద్ తెలిపారు.

కొన్ని నెలల క్రితం, వైకుంఠం, అతని భార్య బేగంపేటలోని వారి పెద్ద కుమారుడి ఇంటికి వెళ్లారు. అయితే, వెళ్లే ముందు అతను కొన్ని విలువైన వస్తువులను అల్మీరాలో ఉంచి, తన కుమారుడితో చర్చించిన తర్వాత వాటి తాళాలను ఇంట్లో దాచిపెట్టాడు. “ఇటీవల, వైకుంఠం అతని భార్య కరీంనగర్‌కు తిరిగి వచ్చి అల్మీరాను తెరిచినప్పుడు, కొన్ని విలువైన వస్తువులు లేవని వారు గ్రహించారు. 

వారు హైదరాబాద్‌లోని తమ కొడుకుకు అదే విషయాన్ని తెలియజేశారు. అయితే ఏం పోయాయో చెప్పకుండా కేసు నమోదు చేశారు. దీంతో వైకుంఠం ఫోన్ ను వెరిఫై చేసినప్పుడు, బాధితురాలి రెండవ కోడలు ఇమెయిల్‌తో లింక్ చేయబడిన కాల్ రికార్డర్ ఫోన్‌లో కనిపించింది ”అని ACP అన్నారు.

"అతని అనుమతి లేకుండా, అతని కోడలు, కుమారుడు తన ఫోన్‌లో యాప్‌ని ఇన్‌స్టాల్ చేశారని ఆరోపిస్తూ, ఫిర్యాదుదారు మాకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు" అని ప్రసాద్ చెప్పారు.ఐటీ చట్టంలోని సెక్షన్ 43 r/w 66, 66-C కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

click me!