భార్యపై అనుమానం.. 11 నెలల చిన్నారి కాలిగజ్జెలకు కరెంట్ షాక్ ఇచ్చి.. తండ్రి చేసిన ఘాతుకం...

By SumaBala BukkaFirst Published Dec 4, 2021, 7:38 AM IST
Highlights

దౌల్తాబాద్ చెందిన సునీతను రెండేళ్ల కిందట వెంకట్రావుపేటకు చెందిన ఎం. రాజశేఖర్ వివాహమాడాడు.  కొంతకాలం కాపురం సజావుగా సాగింది. వీరికి ఒక పాప కూడా పుట్టింది. అయితే, తండ్రి నయ్యానని సంతోషించాల్సింది పోయి.. పాప పుట్టినప్పటినుంచి సునీత పై రాజశేఖర్, అతని తల్లిదండ్రులు నరసవ్వ, యాదయ్య, చెల్లెలు సౌందర్య అనుమానం పెంచుకున్నారు.

తొగుట :  ఘల్లు ఘల్లు మంటూ గజ్జెల శబ్దం చేస్తూ పసిపాప ఇళ్లంతా తిరుగుతూ, సందడి చేస్తుంటే.. కన్న parentsకే కాదు చూసేవారికీ ముచ్చటగా ఉంటుంది. ఆ చిన్నారిని ముద్దుల్లో ముంచెత్తాలని ఆశపుడుతుంది. అబ్బురం వేస్తుంది. కానీ అందరికంటే ఎక్కువ సంబర పడాల్సిన కన్న తండ్రి మాత్రం కక్షతో రగిలిపోయాడు. అనుమానంతో మానవత్వాన్ని మరిచాడు. 

ఆ బుజ్జాయి కాళ్లకు కర్కశంగా current shock పెట్టి నిండు ప్రాణాలు తీశాడు. ఆ తరువాత ఏమనిపించిందో.. తాను చేసింది తప్పు అనుకున్నాడో.. చిన్నారి ప్రాణాలతో గిలగిలలాడుతుంటే కనువిప్పు కలిగిందో తెలీదు కానీ.. తర్వాత తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన ఘటన siddipet district తొగుట మండలం వెంకట్రావు పేట లో శుక్రవారం జరిగింది. 

దౌల్తాబాద్ చెందిన సునీతను రెండేళ్ల కిందట వెంకట్రావుపేటకు చెందిన ఎం. రాజశేఖర్ వివాహమాడాడు.  కొంతకాలం కాపురం సజావుగా సాగింది. వీరికి ఒక girl child కూడా పుట్టింది. అయితే, తండ్రి నయ్యానని సంతోషించాల్సింది పోయి.. పాప పుట్టినప్పటినుంచి సునీత పై రాజశేఖర్, అతని తల్లిదండ్రులు నరసవ్వ, యాదయ్య, చెల్లెలు సౌందర్య suspicious పెంచుకున్నారు.

ఈ అనుమానంతోనే తరచు కొట్లాట పెట్టుకునేవారు. సునీతను రకరకాలుగా వేధించేవారు. వీటిని తట్టుకోలేక రాజశేఖర్, సునీత తల్లిదండ్రుల ఇంటినుంచి అద్దె ఇల్లు చూసుకుని వేరుగా వచ్చేశారు. అక్కడ కొద్ది రోజులు బాగానే ఉన్నా.. ఆ తరువాత రాజశేఖర్ మళ్లీ మొదటికి వచ్చాడు.

ప్రశాంత్ కిశోర్‌ అతిగా ఊహించుకుంటున్నారు.. టీఆర్‌ఎస్‌తో మాది కొట్లాటే : తేల్చేసిన జగ్గారెడ్డి

 కొద్దిరోజులకే  భర్త మనసు మార్చుకున్నాడు. తల్లిదండ్రుల వద్దే ఉందామంటూ సునీతతో ఘర్షణ పడుతున్నాడు. అదే క్రమంతో శుక్రవారం  భార్యను ఇదే విషయమై తిట్టి, కొట్టి కుమార్తె ప్రిన్సి (11 నెలలు) ఎత్తుకొని బయటికి వచ్చాడు. నేరుగా తాను కౌలు చేస్తున్న భూమి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ప్రిన్సీ కాళ్ల గజ్జల కు తీగలు చుట్టి మోటార్ స్టార్టర్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యేలా చేశాడు.

కరెంట్ షాక్ తో చిన్నారి కన్నుమూసింది. తరువాత రాజశేఖర అక్కడే పురుగుల మందు తాగాడు. అంతకు ముందు మరో రైతుకి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఆ రైతు గ్రామస్తులకు సమాచారం అందించి... వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే కరెంట్ షాక్ తో పాప చనిపోయి ఉంది. రాజశేఖర్ కొన ప్రాణాలతో ఉన్నాడు. 

యాజమాన్యంతో సింగరేణి కార్మికుల చర్చలు విఫలం, బంతి కేంద్రం కోర్టులో.... సమ్మె యథాతథం

కరెంట్ షాక్ తోమాడిపోయిన పసికందు పాదాల్ని, కాలి గజ్జెల్ని చూసి తల్లి సునీత గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరయ్యింది. నిందితుడు రాజశేఖర్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది, 
 

click me!