యాజమాన్యంతో సింగరేణి కార్మికుల చర్చలు విఫలం, బంతి కేంద్రం కోర్టులో.... సమ్మె యథాతథం

By Siva Kodati  |  First Published Dec 3, 2021, 9:33 PM IST

సింగరేణి కార్మిక సంఘాలతో యాజమాన్యం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సంస్థలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ.. సమ్మె వల్ల సింగరేణి అభివృద్ధికి విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది


సింగరేణి కార్మిక సంఘాలతో యాజమాన్యం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సంస్థలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ.. సమ్మె వల్ల సింగరేణి అభివృద్ధికి విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. బొగ్గు బ్లాక్‌ల వేలం కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయమని.. సమ్మె ఆలోచనను కార్మిక సంఘాలు విరమించుకోవాలని యాజమాన్యం కార్మికులకు సూచించింది. అటు కార్మిక సంఘాలు మాట్లాడుతూ... సింగరేణిని కాపాడుకునేందుకే సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. సంఘటితంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బొగ్గు బ్లాక్‌లు సాధిస్తామని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఈ నెల 6న మరోసారి రీజనల్ లేబర్ కమీషనర్‌తో కార్మిక సంఘాలు చర్చలు జరపనున్నాయి. 

మరోవైపు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ  సింగరేణిలో కార్మిక సంఘాలు Strike  noticeను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 9వ తేదీ నుండి 72  గంటల పాటు సమ్మెను నిర్వహించనున్నాయి. కార్మిక సంఘాల నేతలు సమ్మె నోటీసులు ఇవ్వడంతో  కార్మిక సంఘాలతో సింగరేణి అధికారులు శుక్రవారం నాడు చర్చలకు ఆహ్వానించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన  Coal india, సింగరేణిలు స్వంత వనరులతోనే లాభాల బాటలో సాగుతున్నాయి. పన్నుల రూపంలో అయిదేళ్లలో సింగరేణి రాష్ట్రానికి రూ. 15,011 కోట్లు, కేంద్రానికి రూ. 17,690 కోట్లు కేంద్రానికి చెల్లించింది.

Latest Videos

undefined

ALso Read:సింగరేణిలో సమ్మె సైరన్: కార్మిక సంఘాలతో నేడు అధికారుల చర్చలు

singareni సంస్థ తనకు చెందిన నాలుగు coal బ్లాకుల్లో నిక్షేపాలను వెలికి తీసేందుకు భూసేకరణ కోసం రూ. 750 కోట్లను కేటాయించింది. వీటికి వేలం నిర్వహిస్తే ఉత్పత్తి విలువలో 4 శాతం చెల్లించి పాల్గొనాల్సి ఉంటుంది. వేలంలో ప్రైవేట్ సంస్థలు ఎక్కువ కోట్ చేసి బ్లాకులను దక్కించుకొంటే ప్రభుత్వ రంగ సంస్థలు వెనుకబడిపోతాయని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

click me!