జగిత్యాల జిల్లాలో అమానుషం... తండ్రీ, ఇద్దరు కొడుకులను కిరాతకంగా నరికిచంపిన దుండగులు (Video)

By Arun Kumar PFirst Published Jan 20, 2022, 4:14 PM IST
Highlights

జగిత్యాల జిల్లాతో దారుణం చోటుచేసుకుంది. మంత్రాల నెపంతో తండ్రీ, ఇద్దరు కొడుకులనే గుర్తుతెలియని దుండుగులు కత్తులతో అతి కిరాతకంగా దాడిచేసి చంపారు.  

జగిత్యాల: మూడ నమ్మకాలు ఓ కుటంబంలో తీరని విషాదాన్ని నింపాయి. మంత్రాల నెపంలో తండ్రీ, ఇద్దరు కొడుకులను అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపిన అమానవీయం జగిత్యాల జిల్లా (jagitial district)లో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... జగిత్యాల రూరల్ మండలం తారకరామనగర్ (tarakaram nagar) లో నాగేశ్వరరావు కుటుంబంతో కలిసి జీవించేవాడు. అయితే హటాత్తుగా ఏమయ్యిందో తెలీదు కానీ నాగేశ్వర రావుతో పాటు ఇద్దరు కొడుకులు రాంబాబు, రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు ఈ ముగ్గురినీ అతి దారుణంగా నరికిచంపారు.  

Video

కుల సంఘానికి చెందిన స్థలంలో ఈ ముగ్గురూ రక్తపు మడుగులో పడివుండటాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో చేరుకుని ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

మంత్రాలు, క్షుద్రపూజల నెపంతోనే తండ్రీ కొడుకులను ఇంత దారుణంగా హతమార్చి వుంటారని అనుమానిస్తున్నారు. అయితే మంత్రాలే ఈ ముగ్గురి హత్యకు కారణమా లేక మరేవైనా ఇతక కారణాలు వున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తండ్రీ కొడుకుల హత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుున్నట్లు పోలీసులు తెలిపారు.   

ఇదిలావుంటే ఇదే తారకరామ నగర్ లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. చనిపోయిన వ్యక్తిని తిరిగి బతికిస్తామంటూ దంపతులు ముందుకు రాగా మృతుని కుటుంబ సభ్యులు వారి మాటలు నమ్మి పోలీసులనే ఎదిరించి ఆందోళనకు దిగిన ఘటన ఇక్కడ గతంలో చోటుచేసుకుంది. 

తారకరామానగర్ కు చెందిన ఒర్సు రమేష్, అనిత భార్య భర్తలు. వీరి ఇంటి సమీపంలోని కొమ్మరాజు పుల్లేశ్, సుభద్ర దంపతులు నివాసముండేవారు. అయితే ఇరు కుటుంంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే ఓసారి అంతు చూస్తానంటూ పుల్లేశ్.. రమేష్ ను బెదిరించాడు.  

అయితే కొద్దిరోజుల తర్వాత రమేశ్‌ ఇంట్లో దుర్గమ్మ పండగ చేసుకున్నారు. మరుసటి రోజు రమేష్ పిలవకుండానే పుల్లేష్ అతని ఇంటికి భోజనం కోసం వెళ్ళాడు. అప్పటికి భోజనం అయిపోగా,  కాసేపు ఆగితే వండిపెడతానని రమేష్ చెప్పాడు. అయితే పుల్లేశ్‌  ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.  ఆ తర్వాతి రోజు రమేష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.  చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కొమ్మరాజు పుల్లేశ్,  సుభద్ర చేతబడి చేయడంతోనే రమేష్ చనిపోయాడని మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆ దంపతులను చెట్టుకు కట్టేసి కొట్టారు. దెబ్బలు భరించలేక తానే చేతబడి చేశానని... సగం చంపానని.... క్షుద్ర పూజ చేసి బతికి ఇస్తాననినని రాజు చెప్పాడు. దాంతో మృతుడి కుటుంబసభ్యులు పూజా సామాగ్రి తీసుకొచ్చారు.  పూజ చేసేందుకు  దంపతులు సిద్ధపడుతున్న నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు రాజు, సుభద్రలను అదుపులోకి తీసుకున్నారు.  

అయితే రమేశ్‌ సగం ప్రాణంతో ఉన్నాడని, అతని మృతదేహాన్ని తరలించవద్దని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి శవాన్ని తరలించి పరీక్షించారు. మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు పుల్లేశ్‌... మంత్రం వేస్తే రమేష్ బతికి వస్తాడంటూ.. కుటుంబ సబ్యులు, బంధువులు కరీంనగర్–జగిత్యాల రహదారిపై ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు వారిని చెదరగొట్టి ఎట్టకేలకు అంత్యక్రియలు చేయించారు.

 

click me!