కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

Published : Jan 21, 2023, 06:59 AM IST
కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

సారాంశం

ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెడుతుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కారును లారీ బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణలోని కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు-లారీ ఢీకొట్టింది. నలుగురు మృతి చెందారు. ఇల్లెందు - మహబూబాబాద్ మధ్య కోటి లింగాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కారు నడుపుతున్న వ్యక్తితో పాటు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తిని ఇల్లెందు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. 

రోడ్డు ప్రమాదం సమాచారం అందడంతో పోలీసులు ఘటనస్థలికి చేరుకున్నారు. సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ప్రమాదానికి లోనైన వ్యక్తి రణధీర్ ను చికిత్స కోసం ఖమ్మంకు తరలించారు. మృతులందరూ హనుమకొండ జిల్లా కమలాపూర్ కు చెందిన అరవింద్, వరంగల్ కు చెందిన రాము, కల్యాణ్, శివగా గుర్తించారు. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వీరంతా మోతేకి వెడుతున్నట్లు తెలుస్తోంది. టీఎస్03ఎఫ్ సీ 9075 నంబరు గల కారు మహబూబాబాద్ వైపు నుంచి ఇల్లందు వెడుతోంది. ఈ కారును ఏపీ16టీజీ 3859 అనే నంబరు గల ఇల్లెందు నుంచి మహబూబాబాద్ వైపు వెడుతున్న లారీ వేగంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ఐదుగురిలో ముగ్గురు స్పాట్ డెడ్ అయ్యారు. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందాడు.  

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు.. రంగంలోకి డాగ్ స్క్వాడ్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Holiday : ఈసారి లాంగ్ వీకెండ్.. వరుసగా మూడ్రోజులు సెలవులే.. ఎందుకో తెలుసా?
Weather Update: వీకెండ్‍లో కూల్ వెదర్..రానున్న రెండ్రోజుల్లో వర్షాలే వర్షాలు | Asianet News Telugu