టీ కాంగ్రెస్‌లో జనగామ డీసీసీ పంచాయతీ : కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి రేవంత్, కోమటిరెడ్డి మద్ధతు.. జంగావైపు ఉత్తమ్

Siva Kodati |  
Published : Jan 20, 2023, 09:59 PM IST
టీ కాంగ్రెస్‌లో జనగామ డీసీసీ పంచాయతీ : కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి రేవంత్, కోమటిరెడ్డి మద్ధతు.. జంగావైపు ఉత్తమ్

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్‌లో జనగామ డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక వ్యవహారం కలకలం రేపుతోంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిలు కొమ్మూరికి మద్ధతు పలకగా.. సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మాత్రం వ్యతిరేకించారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. జనగామ డీసీసీ అధ్యక్ష ఎన్నికపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి డీసీసీ ఇవ్వాలనే ప్రతిపాదనపైనా చర్చ జరిగింది. అటు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిలు కొమ్మూరికి మద్ధతు పలకగా.. సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మాత్రం వ్యతిరేకించారు. అలాగే ప్రతాప్ రెడ్డిని ఇన్‌ఛార్జ్ థాక్రేకు పరిచయం చేశారు కోమటిరెడ్డి. మరోవైపు జనగామ డీసీసీకి జంగా రాఘవరెడ్డి పేరును సూచించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 

ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాక్రేతో భేటీ అయిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. కమిటీలో తాను చెప్పిన పేర్లు లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలో తనకు సరైన గౌరవం దక్కాలని.. అందరి సమిష్టి నిర్ణయాలు వుండాలన్నారు. ఇవన్నీ జరిగితే తాను మరింత ఉత్సాహంతో పనిచేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. 

Also Read: ఇన్‌ఛార్జ్ కూడా జిల్లాల్లో తిరగాలి.. 50 శాతం టిక్కెట్లు ముందే కన్ఫర్మ్ చేయాలి : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అంతకుముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్‌కు వచ్చారు. అంతేకాదు.. గత కొంతకాలంగా ఉప్పు నిప్పులా వున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ మెట్లు ఎక్కనని తాను అనలేదన్నారు. కొత్త ఇన్‌ఛార్జ్ ఆహ్వానించడంతో వచ్చానని ఆయన తెలిపారు. గాంధీ భవన్‌తో తనకు 30 ఏళ్ల అనుబంధం వుందన్నారు. 26 నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి ఎలా రావాలి అనే అంశంపై చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

ఇకపోతే.. ఎఐసీసీ ఇచ్చిన షోకాజ్ నోటీసులు చెత్లబుట్టలో  పడ్డాయని  కొద్దిరోజుల క్రితం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.షోకాజ్  నోటీస్ అనేది లేనే లేదన్నారు .  గాంధీభవన్ కు ఇతర నేతలు  కూడా రాలేదని ఆయ న చెప్పారు. పీసీసీ కమిటీలను తాను పట్టించుకోనన్నారు.నాలుగైదు సార్లు  ఓటమిపాలైనవారితో తాను కూర్చోవాలా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నందున ప్రజల్లోకి వెళ్లి యుద్ధం చేయాలన్నారు.ఈ విషయమై  ఠాక్రే కొన్ని సలహాలు చెప్పారన్నారు. తాను కూడా  కొన్ని అంశాలను మాణిక్ రావుకు  చెప్పినట్టుగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. తన గురించి ఠాక్రేకు తెలుసునన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : వాయుగుండం దెబ్బకు క్లౌడ్ బరస్ట్... ఇక ఈ ప్రాంతాల్లో కుండపోత ఖాయం, బిఅలర్ట్
CM Revanth Reddy Powerful Speech: పూలే దంపతుల విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్