ప్రభుత్వ భూముల్లో ఇండస్ట్రీయల్ జోన్ ఏర్పాటు చేసే వరకు పోరాటం చేయాలని రైతు జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ అడ్లూరు ఎల్లారెడ్డిలో రైతు జేఏసీ సమావేశమైంది
కామారెడ్డి: ప్రభుత్వ భూముల్లో ఇండస్ట్రీయల్ జోన్ ఏర్పాటు చేసే వరకు పోరాటం చేయాలని రైతు జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఇశాళ అడ్లూరు ఎల్లారెడ్డిలో ఏడు గ్రామాలకు చెందిన రైతులు ఆదివారంనాడు సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఇండస్ట్రీయల్ జోన్ ను ప్రభుత్వ భూముల్లోనే ఏర్పాటు చేసే వరకు పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై న్యాయ పోరాటం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11వ తేదీ నుండి మరోసారి ఉద్యమాన్ని చేయాలని రైతు జేఏసీ నిర్ణయం తీసుకుంది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 49 కౌన్సిలర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయమై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు తీర్మానం చేయాల్సి ఉన్నందున కౌన్సిలర్లకు వినతిపత్రాలు చేయాలని నిర్ణయించారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై నిన్న కలెక్టర్ జితేష్ పాటిల్ , కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ లు ప్రకటించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదా మాత్రమేనని తెలిపారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో రైతుల అనుమానాలను నివృత్తి చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఈ విషయమై ఏమైనా ఫిర్యాదులుంటే రాత పూర్వకంగా ఇవ్వాలని కలెక్టర్ కోరారు. దీంతో ఇవాళ అడ్లూరు ఎల్లారెడ్డిలో రైతు జేఏసీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి హాజరయ్యారు.
undefined
also read:కామారెడ్డి మాస్టర్ ప్లాన్: నేడు అడ్లూర్ ఎల్లారెడ్డిలో రైతు జేఏసీ భేటీ, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
ఇంస్ట్రీయల్ జోన్ ఏర్పాటు చేసేందుకు వీలుగా రైతుల నుండి రెండు పంటలు పండే భూములను ప్రభుత్వం తీసుకొంటుందనే భావనతో రైతులు కొంత కాలంగా ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై ప్రభుత్వం వెనక్కు తగ్గింది. కలెక్టర్ ప్రకటన ఇందుకు అద్దం పడుతుందని రైతు జేఏసీ నేతలు చెబుతున్నారు.