శంషాబాద్‌లో భర్తను కత్తితో పొడిచి హత్య చేసిన భార్య.. కారణమిదేనా?

Published : Jan 08, 2023, 04:01 PM IST
శంషాబాద్‌లో భర్తను కత్తితో పొడిచి హత్య చేసిన భార్య.. కారణమిదేనా?

సారాంశం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో  దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది. 

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో  దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది. అయితే భర్త తాగొచ్చి కొట్టడం వల్లే మహిళ అతడిపై కత్తితో దాడి చేసినట్టుగా తెలుస్తోంది.  వివరాలు.. బాధితుడు వి రాజు తన భార్య జ్యోతితో కలిసి శంషాబాద్ మండలంలోని నానాజీపూర్ నివసిస్తున్నాడు. శనివారం రాత్రి రాజు మద్యం సేవించి మత్తులో ఇంటికి వచ్చాడు. ఏదో విషయమై భార్యతో గొడవపడి ఆమెను కొట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఆవేశంతో జ్యోతి కత్తి తీసుకుని రాజును పొడిచింది. రాజు ఘటన స్థలంలోనే చనిపోయాడు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. జ్యోతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే