జగిత్యాల కొత్త మాస్టర్ ప్లాన్ : మున్సిపల్ కార్యాలయం ముందు మూడు గ్రామాల రైతుల ధర్నా

By narsimha lode  |  First Published Jan 10, 2023, 2:34 PM IST

జగిత్యాల  మాస్టర్ ప్లాన్  ప్రతిపాదనను నిరసిస్తూ  మున్సిపల్ కార్యాలయం ముందు  రైతులు  ఆందోళనకు దిగారు. మాస్టర్ ప్లాన్  ఫ్లెక్సీని  రైతులు చించేశారు.  


జగిత్యాల:  జగిత్యాల కొత్త మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన ను నిరసిస్తూ  మున్సిపల్ కార్యాలయం ముందు   రైతులు మంగళవారంనాడు ధర్నాకు దిగారు . నూతన మాస్టర్  ప్లాన్ లో తమ గ్రామాలను  పలు జోన్ల కింద విభజించడంపై   రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .  కొత్త మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  నర్సింగపూర్, తిమ్మాపూర్, మోతె గ్రామాల రైతులు  ఇవాళ  మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.  మున్సిపల్ కార్యాలయం  ఎదుట ఏర్పాటు  చేసిన  మాస్టర్ ప్లాన్  ఫ్లెక్సీని  చించేశారు. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని  రైతులు డిమాండ్  చేశారు. 

ఇటీవలనే  కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  ఏడు గ్రామాల రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే.కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  ఈ నెల  5వ తేదీన  ఏడు గ్రామాల రైతులు ఆందోళన నిర్వహించారు.  ఈ ఆందోళన ఉద్రిక్తంగా మారింది.అడ్లూరు ఎల్ారెడ్డికి చెందిన  రాములు అనే రైతు  ఈ నెల  4వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో  ఆందోళనను ఉధృతం  చేయాలనే ఉద్దేశ్యంతో  రైతులు  కలెక్టరేట్  ముందు  నిరసనకు దిగారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  అడ్లూరు ఎల్లారెడ్డికి  చెందిన   ఉపసర్పంచ్  సహా తొమ్మిది మంది వార్డు సభ్యులు కూడా రాజీనామాలు సమర్పించారు.   అడ్లూరు ఎల్లారెడ్డి సర్పంచ్ కూడా రాజీనామా చేయాలని రైతులు ఆయనపై ఈ నెల  5వ తేదీన దాడికి దిగారు.  రైతుల ఆందోళనకు  బీజేపీ, కాంగ్రెస్ లు మద్దతు ప్రకటించాయి. 

Latest Videos

undefined

also read:ప్రభుత్వ భూముల్లో ఇండస్ట్రీయల్ జోన్ ఏర్పాటు వరకు పోరాటం: రైతుజేఏసీ నిర్ణయం

ఈ నెల  6వ తేదీన కామారెడ్డి బంద్ నిర్వహించారు.  అయితే  ఈ విషయమై  ప్రభుత్వం వెనక్కు తగ్గింది.  మాస్టర్ ప్లాన్  ముసాయిదా మాత్రమేనని కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రకటించారు.  దీంతో  రైతులు  తమ ఆందోళన విషయంో  మార్పులు  చేర్పులు చేశారు. ప్రభుత్వ భూముల్లో ఇండస్ట్రీయల్  జోన్ ఏర్పాటు చేసే వరకు  ఆందోళనను కొనసాగించాలని  రైతు జేఏసీ నిర్ణయం తీసుకుంది.  మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ   హైకోర్టును రైతులు ఆశ్రయించారు.  ఈ నెల  11 నుండి   కౌన్సిలర్లకు  వినతిపత్రాలు  సమర్పించనున్నారు  రైతు జేఏసీ నేతలు.

click me!