గల్ఫ్ లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా: బోర్డు తిప్పేసిన ట్రావెల్స్ సంస్థ

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో  గల్ఫ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని  నకిలీ గల్ఫ్ ఏజంట్  బోర్డు తిప్పేశాడు.  ఈ విషయమై బాధితులు డిచ్ పల్లి పోలీసులకు  ఫిర్యాదు  చేశారు. 


నిజామాబాద్:  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని  డిచ్ పల్లిలో   గల్ఫ్  దేశాలకు   పంపిస్తామని  చెప్పి నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసిన  ఆర్ కే  ట్రావెల్స్ సంస్థ  బోర్డు తిప్పేసింది.  ఈ సంస్థ  ప్రతినిధులు  సంస్థ  దుకాణం మూసేసి  పారిపోయారు.  ఇవాళ  వీసాలు  ఇస్తామని  చెప్పడంతో  డబ్బులు చెల్లించిన  వారంతా  ట్రావెల్స్ కార్యాలయానికి చేరుకన్నారు. కానీ ఈ సంస్థ వద్ద ఎవరూ  లేకపోవడంతో  మోసపోయినట్టుగా  గుర్తించి పోలీసులకు  ఫిర్యాదు  చేశారు. 

గల్ఫ్ లో  ఉద్యోగాలు  ఇప్పిస్తామని   నిరుద్యోగుల నుండి  రూ. 20 వేల నుండి  రూ. 50 వేల చొప్పున  ఆర్ కె ట్రావెల్స్  సంస్థ డబ్బులు వసూలు చేసింది. ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాల  నుండి  నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేశాడు.సుమారు  250 మంది నిరుద్యోగుల నుండి  డబ్బులు వసూలు  చేశారు.  గల్ఫ్ లో  ఉద్యోగాలు వచ్చాయని  డబ్బులు  చెల్లించిన వారికి  నకిలీ  ఆఫర్ లెటర్లు  కూడా  అందించాడు. ఫుడ్ ప్రాసెసింగ్  యూనిట్లలో  ఉద్యోగాలు  వచ్చాయని  ఆర్ కె ట్రావెల్స్  ప్రతినిధులు నిరుద్యోగులను నమ్మించాడు . ఈ నెలలో  గల్ఫ్  దేశాలకు  పంపిస్తానని  ఏజంట్  చెప్పిన మాటలు నమ్మిన  నిరుద్యోగులు సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ  ఈ సంస్థ బోర్డు  తిప్పేసింది. కార్యాలయానికి తాళం వేశారు.  గల్ఫ్ ఏజంట్  కన్పించకుండా  పోయాడు. దీంతో  బాధితులు  పోలీసులకు పిర్యాదు  చేశారు.  

Latest Videos

గతంలో  కూడ ఇదే తరహలో  గల్ప్  దేశాలకు పంపుతామని చెప్పి నిరుద్యోగులను  మోసం చేసిన ఘటనలున్నాయి.   ఈ విషయమై  తమకు న్యాయం చేయాలని కూడా బాధితులు   కోరుతున్నారు. ఉద్యోగాలు వచ్చాయని  గల్ఫ్ దేశాలకు  పంపి  అక్కడ  ఉద్యోగాలు  లేక  జైళ్లలో  పలువురు మగ్గిన ఘటనలు కూడా లేకపోలేదు

click me!