కామారెడ్డిలో రైతుల ఆందోళన తీవ్రతరం.. కలెక్టర్ మొండిపట్టు వల్లే ఇలా, తమతో మాట్లాడాల్సిందేనంటోన్న అన్నదాతలు

Siva Kodati |  
Published : Jan 05, 2023, 05:31 PM ISTUpdated : Jan 05, 2023, 05:39 PM IST
కామారెడ్డిలో రైతుల ఆందోళన తీవ్రతరం.. కలెక్టర్ మొండిపట్టు వల్లే ఇలా, తమతో మాట్లాడాల్సిందేనంటోన్న అన్నదాతలు

సారాంశం

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యవహారం నేపథ్యంలో కలెక్టర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల సమస్యలను వినకుండా ఆయన లోపలే వుండిపోవడంతో అన్నదాతలు భగ్గుమంటున్నారు.   

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించిన సంగతి తెలిసిందే. కొత్త మాస్టర్ ప్లాన్ ను  వెంటనే వెనక్కి తీసుకోవాలని కలెక్టరేట్ వద్ద  గురువారంనాడు  రైతులు ఆందోళన నిర్వహించారు . కలెక్టరేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు  రైతులు  ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. కామారెడ్డి  మాస్టర్ ప్లాన్  పరిధిలోకి  ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది గ్రామాలను చేర్చారు.ఈ గ్రామాల్లోని రైతుల నుండి భూములను సేకరించి  ఇండస్ట్రీయల్ కారిడార్ కు  కేటాయించనున్నారు. ఈ ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారు.తమకు జీవనోపాధిని కల్పించే  భూములను ఇవ్వబోమని రైతులు  చెబుతున్నారు.  

మరోవైపు.. తన భూమి పోతోందనే భయంతో రాములు అనే రైతు  నిన్న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఇవాళ ఎనిమిది గ్రామాల రైతులు  ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని  ఆందోళనకు దిగారు. తాము భూములను  వదులుకొనే ప్రసక్తేలేదని  రైతులు చెప్పారు.ఇదిలా ఉంటే  రైతులకు మద్దతుగా  బీజేపీ ఎమ్మెల్యే  రఘునందన్ రావు , ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే  రవీందర్ రెడ్డిలు సైతం  ధర్నాలో  పాల్గొన్నారు.  

అయితే రైతుల ఆందోళన తీవ్రరూపు దాల్చడానికి కలెక్టర్ జితేష్ పటేల్ మొండివైఖరే కారణమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రైతులతో మాట్లాడకూడదనే పంతంతో కలెక్టర్ వున్నారు. రైతుల ముట్టడితో కలెక్టరేట్ హోరెత్తుతున్నా విషయాన్ని పోలీసులకే వదిలేశారు కలెక్టర్. రైతు ఆత్మహత్య చేసుకున్నా స్పందించకపోవడంతో ఆయనపై అన్నదాతలు భగ్గుమంటున్నారు. కలెక్టర్ వచ్చి తమతో మాట్లాడేదాకా ఆందోళన విరమించేది లేదని రైతులు తేల్చిచెబుతున్నారు. కలెక్టర్ వచ్చి తమ నుంచి వినతిపత్రం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్