కారణమిదీ:జనగామ మార్కెట్ యాద్ద వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

By narsimha lode  |  First Published May 31, 2021, 4:29 PM IST

 15 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో మనోవేదనతో కొండల్ రెడ్డి అనే రైతు పెట్రోల్ పోసుకొని సోమవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 


జనగామ: 15 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో మనోవేదనతో కొండల్ రెడ్డి అనే రైతు పెట్రోల్ పోసుకొని సోమవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 15 రోజులుగా  ధాన్యం విక్రయించేందుకుగాను  కొండల్ రెడ్డి అనే రైతు జనగామ మార్కెట్ యార్డు వద్దకు వచ్చాడు. అయితే ఇంతవరకు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో  సోమవారం నాడు జనగామ మార్కెట్ యార్డు వద్ద ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశాడు కొండల్ రెడ్డి. ఆ తర్వాత పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  

ఈ విషయాన్ని గమనించిన రైతులు ఆయనను వారించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కోసం కేంద్రాలను కూడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

Latest Videos

రాష్ట్రంలో లాక్‌డౌన్ ఉన్నా కూడ వ్యవసాయ రంగానికి ఎలాంటి ఇబ్బందులు కల్గించకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షల నుండి వ్యవసాయ రంగానికి మినహయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీెఎం ఆదేశాలు జారీ చేశారు. 

click me!