బాలికపై అత్యాచారం, హత్య... నిందితున్ని ఉరితీయాలి: సీతక్క డిమాండ్

Arun Kumar P   | Asianet News
Published : May 31, 2021, 03:58 PM ISTUpdated : May 31, 2021, 04:22 PM IST
బాలికపై అత్యాచారం, హత్య... నిందితున్ని ఉరితీయాలి: సీతక్క డిమాండ్

సారాంశం

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండాలో ఓ కామాంధుడి చేతిలో అత్యాచారానికి గురవడమే కాదు అతి కిరాతకంగా హత్యకు గురయిన బాలిక కుటుంబాన్ని ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. 

మహబూబాబాద్: అభం శుభం తెలియని బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి ఉరిశిక్ష విధించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండాలో ఓ కామాంధుడి చేతిలో అత్యాచారానికి గురవడమే కాదు అతి కిరాతకంగా హత్యకు గురయిన బాలిక కుటుంబాన్ని సీతక్క పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళల రక్షణపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

read more  మహిళపై బురిడీ బాబాల అత్యాచారం.. వీడియోతీసి బ్లాక్ మెయిల్, పోలీసుల సస్పెన్షన్.. !

''టీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ కరువయ్యింది. రాష్ట్రంలో ఎక్కడచూసినా మహిళలు అత్యాచారాలు, హత్యలు, వేధింపులకు గురవుతున్నారు. అత్యాచార నిందితులకు త్వరిత శిక్ష విధించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. అత్యాచారాలలో దేశంలోనే  రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉంది'' అని సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!