మా భూమిని వేలం వేస్తున్నారు:బుద్వేల్‌లో భూముల వేలంపై రైతు గణేష్ కుటుంబం ఆవేదన

By narsimha lode  |  First Published Aug 10, 2023, 11:54 AM IST

రంగారెడ్డి జిల్లా బుద్వేల్ లో భూములను  హెచ్ఎండీఏ అధికారులు గురువారంనాడు వేలం వేయనున్నారు. అయితే  తమ పట్టా భూమిని  వేలం నుండి మినహయించాలని గణేష్  అనే రైతు కుటుంబం కోరుతుంది.


హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బుద్వేల్ లో భూములను  హెచ్ఎండీఏ గురువారంనాడు ఈ వేలం వేయనుంది. అయితే  తన పట్టా భూమిని  హెచ్ఎండీఏ  వేలంలో ప్రతిపాదించడంపై  రైతు గణేష్  కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు. వేలం నుండి తమ భూమిని మినహాయించకపోతే  ఆత్మహత్యలే శరణ్యమని  రైతు గణేష్ తనయుడు  చెబుతున్నారు.  

బుద్వేల్ కు  చెందిన  పి. గణేష్ కు  288/4 సర్వే  నెంబర్ లో నాలుగు ఎకరాలను  1978లో  ఇందిరా గాంధీ కేటాయించింది.  అప్పటి నిబంధనల మేరకు  ప్రభుత్వం కోరినట్టుగానే  డబ్బులు చెల్లించడంతో  తమ తండ్రి గణేష్ పేరున పట్టాదారు పాసు పుస్తకాలను  ప్రభుత్వం  మంజూరు చేసిందని ఆయన  ఓ తెలుగు మీడియాకు  చానెల్ కు  ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.  రెవిన్యూ రికార్డుల్లో తన తండ్రి గణేష్ పేరు కూడ ఉండేదన్నారు. 

Latest Videos

also read:బుద్వేల్ భూముల ఈ వేలం: బార్ అసోసియేషన్ పిటిషన్ ను నిరాకరించిన తెలంగాణ హైకోర్టు

అయితే  కొంత కాలం క్రితం తమకు రెవిన్యూ అధికారుల నుండి నోటీసు వచ్చిందని వారు చెబుతున్నారు. ఈ విషయమై  తహలసీల్దార్ ను  కలిస్తే తమ భూమిని హెచ్ఎండీఏ  తీసుకుందని చెప్పారన్నారు. ఈ విషయమై  హెచ్ఎండీఏ  అధికారులకు  తమ వద్ద  ఉన్న  ఆధారాలను  చూపితే  తమ భూమి విషయంలో జోక్యం చేసుకోబోమని చెప్పారన్నారు. కానీ  ఇవాళ  ఈ వేలంలో  తమ భూమిని కూడ  ఎలా చేర్చుతారని ఆయన  ప్రశ్నించారు. తమ భూమిలో రాత్రికి రాత్రే  హెచ్ఎండీఏ అధికారులు  జెండాలు నాటడంపై  ఆందోళన వ్యక్తం  చేశారు. తమ భూమిని  వేలం నుండి మినహాయించాలని  గణేష్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అధికారులు తమ భూమిని వేలం వేస్తున్నారనే  బాధతో తన తండ్రి ఆసుపత్రి పాలయ్యాడని గణేష్ కొడుకు మీడియాకు  చెప్పారు.

click me!