జిల్లాలోని పెంబర్తి గ్రామంలో ఓ రైతు పొలంలో బంగారంతో నిండి ఉన్న బిందె లభ్యమైంది.
జనగామ: జిల్లాలోని పెంబర్తి గ్రామంలో ఓ రైతు పొలంలో బంగారంతో నిండి ఉన్న బిందె లభ్యమైంది. హైద్రాబాద్ కు చెందిన నర్సింహ అనే వ్యక్తి పెంబర్తి గ్రామ సమీపంలో వరంగల్-హైద్రాబాద్ జాతీయ రహదారికి సమీపంలో 11 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.
ఈ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించాలని ఆయన ప్లాన్ చేశాడు. దీనికి గాను ఆయన ఈ భూమిని జేసీబీతో చదును చేస్తుండగా లంకె బిందె (బంగారంతో ఉన్న బిందె) కన్పించింది.
దీంతో వెంటనే ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ బిందెను తెరిచి చూస్తే 17 తులాల బంగారం, 10 కిలోల వెండి లభ్యమైంది. కొన్ని రోజులుగా తనకు కలలో అమ్మవారు కన్పిస్తున్నారన్నారు. తన భూమిలో అమ్మవారికి గుడిని కట్టించనున్నట్టుగా ఆయన చెప్పారు.
ఈ భూమిని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, తహసీల్దార్ రవీందర్, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు తదితరులు సందర్శించారు.