బేగం బజార్ లో కరోనా కలకలం: 100 మందికి కోవిడ్, సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు

By narsimha lodeFirst Published Apr 8, 2021, 10:35 AM IST
Highlights

నగరంలోని బేగంబజార్ లో సుమారు 100 మందికి కరోనా సోకింది. దీంతో స్వచ్ఛంధంగా దుకాణాలు మూసివేయాలని వ్యాపారులు నిర్ణయం తీసుకొన్నారు.

హైదరాబాద్: నగరంలోని బేగంబజార్ లో సుమారు 100 మందికి కరోనా సోకింది. దీంతో స్వచ్ఛంధంగా దుకాణాలు మూసివేయాలని వ్యాపారులు నిర్ణయం తీసుకొన్నారు.ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే  దుకాణాలను ఓపెన్ చేయాలని వ్యాపారులు నిర్ణయం తీసుకొన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని వైరస్ వ్యాప్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది.ప్రజలు  కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో  కరోనా కేసులు పెరిగిపోతున్నాయనే అభిప్రాయాలను వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 

కరోనా సెకండ్ వేవ్ కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరో నాలుగు వారాల పాటు అప్రమత్తంగా ఉండాలని  వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు.గత ఏడాది కూడ కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో బేగం బజారులో దుకాణాలను మూసివేసిన విషయం తెలిసిందే.

click me!