ఈ రైతు పోరాటం కాలంతోనే కాదు, ప్రాణంతోనూ... చివరి గెలిచాడు...

Published : Jul 23, 2018, 06:28 PM ISTUpdated : Jul 23, 2018, 06:29 PM IST
ఈ రైతు పోరాటం కాలంతోనే కాదు, ప్రాణంతోనూ... చివరి గెలిచాడు...

సారాంశం

రైతు జీవితం మొత్తం పోరాటాలతో నిండి ఉంటుంది. ఆయన ప్రతి క్షణం ఏదో సమస్యతో పోరాడుతూనే ఉంటాడు. వర్షాలతోనూ, ఎండలతోనూ అలుపెరగకుండా పోరాడుతుంటాడు. అలాగే నకిలీ విత్తనాలు, నకిలీ మందులతో పోరాటం. అదృష్టం బాగుండి వాటి నుండి బైటపడి పంట బాగా వస్తే మళ్లీ మార్కెట్ శక్తులతో మరో పోరాటం చేయాలి. ఇలా తన జీవితమంతా సంఘర్షణలతో బ్రతికాను ఇది తనకు ఓ లెక్కా అనుకున్నాడో ఏమో ఓ రైతు దాడిచేసిన క్రూరమైన అడవి పందితో కూడా పోరాడాడు. తనపై దాడి చేసిన అడవి పందిని ఒక్కడే ఎదిరించి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... జిల్లాలోని బోథ్ మండలంలోని సంపత్‌నాయక్ తండాలో కటక్‌వాల్ జైసింగ్ తన పొలంలో పత్తి పంట వేశాడు. అయితే అందులో పిచ్చి మొక్కలు మొలవకుండా నాగలితో దున్నుతున్నాడు. అయితే ఇతడి పొలానికి పక్కనే వున్న ఓ తోటలోంచి ఓ అడవి పంది అమాంతం రైతుపై దాడిచేసింది. ముఖం, భాతిపై గాయాలు చేసింది. 

అయితే ఈ దాడిలో తీవ్రంగా గాయపడి కూడా జైసింగ్ తన దైర్యాన్ని కోల్పోలేదు. ఆ అడవి పందికి ఎదురుతిరిగి ఎలాంటి ఆయుధం లేకుండా కేవలం చేతులతోనే పందిని అదుపుచేశాడు. జైసింగ్ అరుపులను విన్న పక్క పొలాల రైతులు వచ్చి కర్రలతో దాడి చేసి అడవి పందిని చంపారు.

రైతు ఛాతీ భాగంలో, కంటిపై, చంక, భుజం వద్ద పంది కొరికి తీవ్రంగా గాయపర్చింది. దీంతో అతన్ని  108 వాహనంలో బోథ్ దవాఖానకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రైతు చికిత్స పొందుతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!