
అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల దౌర్జన్యం రోజురోజుకూ శృతి మించుతోంది. ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న అధికార పక్షం.. ప్రభుత్వ అధికారులపై దూషణలకు దిగుతోంది.
మొన్న రసమయి బాలకిషన్ అంతకు ముందు ఎంపీ బాల్క సుమన్ ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు. ఇలా అందరూ బంగారు తెలంగాణలో అధికారులపై బూతు పంచంగం విప్పుతూ తమ దర్జాను ఒలకబోస్తున్నారు.
ఈ రోజు కరీంనగర్ జిల్లాలో మిషన్ కాకతీయ కు సంబంధించి ఓ కార్యక్రమం చేపట్టారు.అయితే ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానం పంపలేదని, ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు ఓ అధికారిపై మండిపడ్డారు.
‘జీతాలు తీసుకోవడం లేదా తోడ్క తీస్తా అంటూ మీడియా ముందే బూతులందుకున్నారు. ఎమ్మెల్సీ అనుచరులు కూడా ఆయనదారిలోనే అధికారిని హడలగొట్టారు.
అయితే ఓ ప్రజాప్రతినిధి ఇలా అధికారులను దుర్భాషలాడటంపై ఉద్యోగసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై బాధితుడు మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు.
కాగా, ఉద్యోగ సంఘాల నేతలు ఎమ్మెల్సీ తీరుపై మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.