అభిమాని ఓవరాక్షన్... తుపాకీ బుల్లెట్స్‌తో ‘‘జై బాల్క సుమన్’’ అంటూ పేర్చి, ఆపై వాట్సాప్ స్టేటస్

Siva Kodati |  
Published : Sep 29, 2022, 09:23 PM IST
అభిమాని ఓవరాక్షన్... తుపాకీ బుల్లెట్స్‌తో ‘‘జై బాల్క సుమన్’’ అంటూ పేర్చి, ఆపై వాట్సాప్ స్టేటస్

సారాంశం

మంచిర్యాల జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అభిమాని కొప్పుల రవి ఏకంగా తుపాకీ బుల్లెట్స్‌తో ‘జై బాల్క సుమన్’’ అని పేర్చాడు . అయితే ఒక సాధారణ కార్మికుడికి 62 తుపాకీ బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

కొందరు వ్యక్తులు తమ అభిమాన నేతలపై అభిమానాన్ని కాస్త ఎక్కువగా చూపిస్తూ వుంటారు. అదే సమయంలో సమస్యల్ని సైతం కొన్ని తెచ్చుకుంటూ వుంటారు. తాజాగా మంచిర్యాల జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అభిమాని ఒకరు ఓవరాక్షన్ చేశాడు. అతని పేరు కొప్పుల రవి. ఇతను ఏకంగా తుపాకీ బుల్లెట్స్‌తో ‘జై బాల్క సుమన్’’ అని పేర్చాడు. అక్కడితో ఆగకుండా దానిని వాట్సాప్ స్టేటస్‌ పెట్టుకున్నాడు . ఇది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రవిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇతను శ్రీరాంపూర్ డివిజన్‌లో సింగరేణి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఒక సాధారణ కార్మికుడికి 62 తుపాకీ బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha : కేసీఆర్ కూతురు, అల్లుడు ఏం చదువుకున్నారు, ఏ ఉద్యోగం చేసేవారో తెలుసా..?
IMD Rain Alert : తీవ్రవాయుగుండం తీరం దాటేది ఇక్కడే.. ఈ రెండ్రోజులూ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలే వర్షాలు