ఇంటికెళ్లి పూజలు, రూ.40 కోట్ల వసూలు: బురిడీ బాబా అరెస్ట్

By sivanagaprasad KodatiFirst Published Dec 18, 2019, 8:00 PM IST
Highlights

అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన బురిడీ బాబాను హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన బురిడీ బాబాను హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆధ్యాత్మిక బోధనల పేరుతో అతను ఇప్పటి వరకు రూ.40 కోట్ల మోసాలకు పాల్పడ్డట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

గిరీశ్ సింగ్ అనే వ్యక్తి అద్వైత స్పిరిట్చ్వూవల్ రీచార్జ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ అనే పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్నాడు. మహిళలను పరిచయం చేసుకుని పూజలు చేస్తామని వారికి మాయ మాటలు చెప్పి, ఇళ్లలో పూజలు చేస్తామని నమ్మించేవాడని పోలీసులు తెలిపారు.

Also Read:బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌కు పోలీసుల షాక్: రౌడీషీట్ ఓపెన్

అనంతరం తన దగ్గర 20, 30 కంపెనీలు ఉన్నాయని.. వాటిలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని గిరీశ్ చెప్పేవాడని పోలీసులు వెల్లడించారు. ఇతనిపై గతంలో మీర్‌పేట్, ఎల్‌బీనగర్, మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని.. వీటిపై జైలుకు సైతం వెళ్లాడని పోలీసులు పేర్కొన్నారు.

ఈ నెల 5న మహదేవమ్మ కుమార్తె కళావతి అనే మహిళ ఇంటికి వెళ్లి పూజలు చేసి ఏటీఎం కార్డ్ తీసుకుని లక్ష రూపాయలు డ్రా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం పిన్ నెంబర్ ద్వారా రూ.2.70 వేల విత్ డ్రా చేశాడని చెప్పారు.

Also Read:కేసీఆర్, జగన్ లకు దొరకని మోడీ అపాయింట్ మెంట్: కారణం ఏమిటి...

దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు నమోదు చేసుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇలాంటి అసత్య మాటలతో ఆధ్యాత్మిక బోధనలు చెప్పే నకిలీ బాబాలను నమ్మవద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు

click me!