తెలంగాణలో లాక్ డౌన్ అంటూ.. నకిలీ జీవో వైరల్

Published : Apr 02, 2021, 09:07 AM IST
తెలంగాణలో లాక్ డౌన్ అంటూ.. నకిలీ జీవో వైరల్

సారాంశం

కరోనాతో రాష్ట్రానికి ముప్పు ఉండడంతో రాత్రి వేళల్లో లాక్‌డౌన్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా పేర్కొంటూ ఓ నకిలీ జీవో గురువారం రాత్రి కలకలం సృష్టించింది

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. దీని కారణంగానే గతేడాది ఇదే సమయంలో లాక్ డౌన్ కూడా విధించారు. ఈ లాక్ డౌన్ కారణంగా  చాలా మంది అవస్థలు పడ్డారు. కాగా.. తాజాగా ఈ మహమ్మారి మరోసారి తిరగపెట్టింది. అనూహ్యంగా రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోనూ మరోసారి లాక్ డౌన్ విధిస్తారంటూ వార్తలు రావడం మొదలయ్యాయి.

కరోనాతో రాష్ట్రానికి ముప్పు ఉండడంతో రాత్రి వేళల్లో లాక్‌డౌన్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా పేర్కొంటూ ఓ నకిలీ జీవో గురువారం రాత్రి కలకలం సృష్టించింది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రాష్ట్రంలోని దుకాణాలు, వాణిజ్య సంస్థలు, క్రీడా స్థలాల మూసివేతకు ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొంటూ.. గుర్తుతెలియని ఆగంతకులు నకిలీ ఉత్తర్వులను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు.

ఏప్రిల్‌ 30 లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పేరు, 2021 ఏప్రిల్‌ 1వ తేదీతో ఈ నకిలీ జీవోను రూపొందించారు. అచ్చం ప్రభుత్వం జారీ చేసే జీవోలా ఉండడంతో కొందరు నిజంగానే నమ్మి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కొన్ని టీవీలు కూడా ఈ వార్త ప్రసారం చేశాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇది నకిలీ జీవో అని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ప్రకటించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu