డబ్బులిస్తే ఫేక్ సర్టిఫికేట్స్.. వరంగల్​ కేంద్రంగా ఫేక్ సర్టిఫికెట్స్ రాకెట్.. వీళ్ల తెలివి మాములుగా లేదుగా..

By Sumanth KanukulaFirst Published Dec 23, 2021, 10:50 AM IST
Highlights

వరంగల్ కేంద్రంగా ఫేక్ సర్టిఫికేట్స్ (fake certificates) తయారు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఫేక్ సర్టిఫికేట్స్‌ రాకెట్‌తో సంబంధం ఉన్న ఓవర్‌సీస్ కన్సల్టెన్సీల (overseas consultancy) నిర్వహకులు, వారికి సాయం చేస్తున్న 12 మందిని వరంగల్ పోలీసులు (Warangal Police) అరెస్ట్ చేశారు. 

వరంగల్ కేంద్రంగా ఫేక్ సర్టిఫికేట్స్ (fake certificates) తయారు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఫేక్ సర్టిఫికేట్స్‌ రాకెట్‌తో సంబంధం ఉన్న ఓవర్‌సీస్ కన్సల్టెన్సీల (overseas consultancy) నిర్వహకులు, వారికి సాయం చేస్తున్న 12 మందిని వరంగల్ పోలీసులు (Warangal Police) అరెస్ట్ చేశారు. ఈ ముఠా సభ్యులు ఫెయిల్ అయిన విద్యార్థులకు పాస్ అయినట్టుగా వీరు ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేస్తున్నారు. అంతేకాకుండా తక్కువ మార్కులు వచ్చిన ఇంజనీరింగ్, డిగ్రీ పట్టభద్రులకు ఎక్కువ మార్కుల వచ్చినట్టుగా సరిఫ్టికేట్లు తయారుచేసి విదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందేలా చేస్తున్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్‌లో తక్కువ మార్కులు వచ్చి విదేశాల్లో చదవాలనే ఆశ ఉన్నవారిని టార్గెట్ చేసుకుని నిందితులు ఈ దందా కొనసాగిస్తున్నారు. ఇందుకోసం నిందితులు భారీగానే వసూలు చేస్తున్నారు. 

మోసాన్ని బట్టి విద్యార్థుల నుంచి నిందితులు లక్ష రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఈ మోసానికి పాల్పడుతున్న కన్సల్టెన్సీలు.. విద్యార్థులు నుంచి పూర్తి వివరాలు సేకరించి వాటిని తమ కంప్యూటర్ నిపుణులకు పంపుతారు. ఆ వ్యక్తి విద్యార్థులు కోరిన విధంగా ఫేక్ సర్టిఫికేట్ తయారు చేస్తాడు. ఇక, పోలీసులు 212 మంది విద్యార్థులు ఫేక్ సర్టిఫికేట్స్ పొందారని.. అందులో 62 మంది ఇప్పటికే విదేశాల్లో ఉన్నట్టుగా గుర్తించారు. 

వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి (Tarun Joshi) తెలిపిన వివరాలు.. ఈ కన్సల్టెన్సీలను మహబూబాబాద్‌కు చెందిన అరుణ్, హైదరాబాద్‌కు చెందిన అకుల రవి అవినాశ్ నిర్వహిస్తున్నారు. వీరికి మార్క్‌ మెమోలు ఎడిటింగ్, క్రియేట్ చేయడంలో నైపుణ్యం ఉంది. వీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో ఈ పనికి పాల్పడ్డారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు పేరిట నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి అర్హతలు లేని విద్యార్థులకు కొన్ని కన్సల్టెన్సీల ద్వారా ఫేక్ సర్టిఫికేట్లు విక్రయించేవారు. ఆ విధంగా కనీసం అర్హత లేనివారు, ఫెయిల్ అయిన విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు మార్గం సుగమం చేసేవారు.  


కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్, సుబేదారి పోలీసులు ఆధ్వర్యంలో కన్సల్టెన్సీలపై దాడులు నిర్వహించారు. వారి నుంచి దేశంలోని వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన 212 నకిలీ సర్టిఫికెట్లు , 6 ల్యాప్​ టాప్​లు, ఒక ఐపాడ్, 2 ప్రింటర్లు, 5 సీపీయూలు, 25 నకిలీ రబ్బర్ స్టాంపులు, రెండు  ప్రింటర్ రోలర్స్, ఐదు ప్రింటర్ కలర్స్ బాటిల్స్,  లామినేషన్ మిషన్, 12 సెల్​ ఫోన్లు, 10 లామినేషన్ గ్లాస్ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. 

పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో మహబూబాబాద్‌కు చెందిన దార అరుణ్(28), నక్కలగుట్టలోని Aees Global Consultancy ఓనర్ మాదాడి శ్రీకాంత్ రెడ్డి(38), హైదరాబాద్‌కు చెందిన అకుల రవి అవినాశ్(33), హన్మకొండలోని క్రిస్టల్ ఓవర్‌సీస్ కన్సల్టెన్సీ ఓనర అరాందుల మహేష్ (30),  సుబేదారి పోస్టల్ కాలనీకి చెందిన మీర్జా అక్తర్ అలీ బేగ్ (30), మడికొండ నెహ్రునగర్ ఎస్‌బీ ఓవర్‌సీస్ కన్సల్టెన్సీ  ఓనర్ మదిశెట్టి సచిన్ (30), జిరాక్స్ షాప్ నడిపే చెదార్ల సలోని అలియాస్ రాధ (30),  హన్మకొండలోని ఎక్సైజ్ కాలనీకి చెందిన పొగుల సుధాకర్ రెడ్డి (49), హన్మకొండ గ్లోబల్ కన్సల్టెన్సీ ఉద్యోగి బాలోజు (33), హన్మకొండకు చెందిన బీటెక్ గ్రాడ్యుయేట్ నల్ల ప్రణయ్ (27), సుబేదారికి చెందిన అంబటి ఉత్తమ్ కిరణ్(27), హన్మకొండకు చెందిన ఎం స్వాతి (36) ఉన్నారు. 

click me!