హైద్రాబాద్ లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు, ఏడుగురు విద్యార్ధులు అరెస్ట్: సీవీ ఆనంద్

Published : Feb 15, 2022, 03:35 PM ISTUpdated : Feb 15, 2022, 04:25 PM IST
హైద్రాబాద్ లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు, ఏడుగురు విద్యార్ధులు అరెస్ట్: సీవీ ఆనంద్

సారాంశం

మలక్‌పేటలో అంతరాష్ట్ర నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని  హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.  


హైదరాబాద్: నగరంలోని మలక్‌పేటలో అంతరాష్ట్ర Fake Certificates తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ CV Anand  చెప్పారు. మంగళవారం నాడు హైద్రాబాద్‌లోని తన కార్యాలయంలో సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. ఒక్కో డిగ్రీకి ఒక్కో రేటు చొప్పున వసూలు చేస్తున్నారని సీవీ ఆనంద్ చెప్పారు. 

నకిలీ సర్టిఫికెట్స్ కొనుగోలు చేసిన ఏడుగురుStudents కూడా అరెస్ట్ చేసినట్టుగా సీవీ ఆనంద్ తెలిపారు.తల్లిదండ్రులకు తెలిసే విద్యార్ధులు నకిలీ సర్టిఫికెట్లు కొనుగోలు చేశారని సీపీ వివరించారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల స్కాంపై దర్యాప్తు చేసేందుకు గాను  SIT ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీపీ ఆనంద్ తెలిపారు.మలక్‌పేటలో శ్రీసాయి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న 10 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశామన్నారు.నకిలీ సర్టిఫికెట్లతో ఉన్నత విద్యా వ్యవస్థ నాశనం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

2021 డిసెంబర్ 19న నకిలీ సర్టిపికెట్లు తయారు చేస్తున్న ముఠాను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బషీర్ బాగ్ లోని ఒ కార్యాలయంలో నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఆ సంస్థపై దాడి చేసి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు.  ఇంటర్, డిగ్రీ, బిటెక్ తో పాటు ఇతర సర్టిఫికెట్లను కూడా ఈ ముఠా తయారు చేస్తుందని పోలీసులు గుర్తించారు. సయ్యద్ నవీద్ అలియాస్ ఫైసల్,కన్సల్టెన్సీ యజమాని సయ్యద్ ఓవైసీ అల, డీటీపీ ఆపరేటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ యూనివర్శిటీకి చెందిన బీకామ్ 130 ఆంద్రా యూనివర్శిటీ బిటెక్ సర్టిఫికెట్లు, 27 మహారాష్ట్ర బోర్డు ఇంటర్మీడియట్ సర్టిపికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. నిందితులు ఉపయోగించిన కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు స్కానర్లను సర్టిఫికెట్ పత్రాల బండిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. .

నిందితులు నకిలీ సర్టిఫికెట్లను ఉపయోగించి విదేశాలకు విద్యార్ధులను పంపుతున్నారని అప్పటి సీపీ అంజనీకుమార్ చెప్పారు. విదేశాలకు వెళ్లే విద్యార్ధుల నుండి రూ. 50 నుండి రూ75 వేలు వసూలు చేసేవారని సీపీ వివరించారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్