కరీంనగర్ కాంగ్రెస్ లో ముదిరిన ముఠా తగాదాలు

First Published Nov 7, 2016, 8:34 AM IST
Highlights

2014  ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నా తెలంగాణా కాంగ్రెస్ లో తగ్గని  ముఠా రాజకీయాలు

2014లో ఎన్నికల్లో పరాజయం పాలయి, ఫిరాయింపులతో సతమతమవుతున్నా కాంగ్రెస్ పార్టీలో ముఠాతగాదాల ఛేదు చావలేదు.ఈ గ్రూపు రాజకీయాలతో 2019 ఎన్నికల్లో టిఆర్ ఎస్ ను దెబ్బతీసేంత శక్తి కాంగ్రెస్ సమకూర్చుంటున్నదా అనేది ప్రశ్న. ఎందుకంటే, పైకి గొప్పగా పోరాటాలు చేస్తున్నట్లు కనిపించినా, లోన విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అపుడపుడు  జనరల్ గా పార్టీ  ప్రతిష్టకుదెబ్బ తగిలినపుడు మాత్రం అంతా ఒకటిగా ఉన్నట్లు కనిపించినా, మిగతా సమయంలో  ఐక్యత కంటే అనైక్యతే పార్టీలో బలపడుతూ ఉంది.  ఈ ముఠాలను పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా దారికి తెస్తారో చూడాలి.

 

తాజాగా కరీంనగర్ జిల్లా  కొట్లాటలకు నిలయమయింది.  ఈ నెల తొమ్మదో తేదీన ఎఐసిసి కార్యదర్శి ఆర్ కె కుంతియాతో కలసి పిసిపి అధ్యక్షుడు కరీంనగర్ లో పీజుల బకాయిల గురించి ఎన్ ఎస్ యు ఐ ఏర్పాటుచేసే సభకు హాజరుకావాలి.  అయితే, ఈ తేదీని జిల్లా నాయకులతో సంప్రదించకుండా, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ మాట విని నిర్ణయించారని ఎస్ సి  సెల్ ఛెయిర్మన్ అరేపల్లి మోహన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, శాసన సభ్యుడు జీవన్ రెడ్డి అలిగినట్లు సమాచారం.

 

తేదీని నిర్ణయించి, ఆ సమావేశానికి రమ్మని ఒక ఫోన్ కాల్ చేయడంతో సరిపోదని, నిర్ణయాలు కూడా సమిష్టిగా జరగాలని ఈ నాయకులు చెబుతున్నారు.  అంతే కాదు, సోమవారం నాడు  మంచిర్యాల ఎన్ ఎస్ యు ఐ సమావేశాన్ని  రద్దుచేయించే ప్రయత్నం కూడా చేశారు. అయితే, ఈ మాటను ఖాతరు చేయకుండా  పలువురు సీనియర్ నాయకులు మంచిర్యాల బయలు దేరారు.

 

కరీంనగర్ సమావేశాన్ని అడ్డుకొనక పోయినా, సమావేశం తర్వాత పిసిపి అధ్యక్షుని ఈ విషయంలో నిలదీస్తామని  కొంత మంది నాయకులు ’ఎసియానెట్’ కు తెలిపారు. పిసిసి అధ్యక్షుడు కూడా  కరీం నగర్ జిల్లా అంటే పొన్నం ప్రభాకర్ రెడ్డి మాత్రమే అను కోవడం విచారకరమని వారంటున్నారు.

 

తెలంగాణా ప్రభుత్వం విద్యార్థుల ఫీజు బకాయీలు చెల్లించనందుకు  నిరసనగా  ఎన్ఎస్ యు ఐ అధ్వర్యంలో ప్రతిజిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంతకాల క్యాంపెయిన్ నిర్వహిస్తున్నది. ఇప్పటికే అనేక చోట్ల ఈ సమావేశాలు జరిగాయి. తదుపరి సమావేశం కరీంనగర్ లో  నవంబర్ 9 న జరపాలని నిర్నయించారు. ఈ  సమావేశం నాడు  ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా సంత కాలు సేకరించి రాష్ట్రపతికి ఒక వినతిపత్రం సమర్పించాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది.

 

పైకి పోరాట స్ఫూర్తి కనిపిస్తున్నా లోన ముఠాతగాలు పార్టీలో మూలుగుతున్నాయి.

 

click me!