
యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి 32 అవతారాలతో ఇకపై భక్తులకు దర్శనమివ్వనున్నాడు. దీనికి సంబంధించిన ప్రతిపాదనపై స్వయంగా సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించారు. సోమవారం యాదాద్రి అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. లక్ష్మీ నరసింహుడు 32 అవతారాలు ప్రతిబింబించేలా విగ్రహాలను ప్రతిష్టించాలని సీఎం అధికారులకు సూచించారు. లక్షమందికి పైగా భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా దర్శనం జరగాలన్నారు. యాదాద్రికి నలువైపులా నాలుగు లైన్ల రోడ్డు నిర్మించాలని, ప్రధాన గుట్టకు అభిముఖంగా ఉండే గుట్టపై కాటేజీలు, ఈశాన్య భాగంగా 13 ఎకరాల గుట్టపై రెసిడెంట్ సూట్ నిర్మించాలని కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు. అలాగే ఇప్పుడున్న బస్టాండ్, డిపోలను మరోచోటుకు మార్చాలని ఆదేశించారు.