
హైదరాబాద్ లో ఓ నకిలీ డాక్టర్ పట్టుబడ్డాడు. రష్యా వర్సిటీకి చెందిన నకిలీ డిగ్రీతో డాక్టర్ గా పని చేస్తున్న వ్యక్తిని శుక్రవారం కర్మన్ ఘాట్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పోలీసులు అరెస్టు చేశారు. గతంలో వివిధ ఆసుపత్రుల్లో కాంపౌండర్ గా, పీఆర్వోగా పనిచేసిన నిందితుడు తన పాస్ పోర్టుపై రష్యాకు చెందిన నకిలీ ఇమ్మిగ్రేషన్ స్టాంప్ ను పొందేందుకు కూడా ప్రయత్నిస్తున్నాడు.
కామారెడ్డిలో ఒకే విద్యార్థిని.. మూడుసార్లు కాటేసిన పాము.. !
నిర్ధిష్టమైన సమాచారం మేరకు ఎల్బీ నగర్ కు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) సిబ్బంది మీర్ పేట్ పోలీసులతో కలిసి కర్మన్ ఘాట్ లోని ఆర్కే హాస్పిటల్ లో డాక్టర్ గా పని చేస్తున్న కె విజయ్ కుమార్ (36)ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతడు నిజం ఒప్పుకున్నాడు. ఆయన ఇచ్చిన సమాచారం తో మల్లేపల్లేకిల్లి చెందిన సిటి స్కాన్ టెక్నీషియన్ అఫ్రో జ్ ఖాన్, హబీబ్ నగర్ కు చెందిన కంప్యూటర్ ఆపరేటర్ మహబూబ్ అలీ జునైద్ లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్ : పార్థ ఛటర్జీ ఎవరంటే...
2020-2021 మధ్య కాలంలో తాను ఉప్పల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ గా ఆరు నెలల పాటు నెలవారీ రూ.60,000 జీతంతో పనిచేశానని విజయ్ పేర్కొన్నాడు. తదనంతరం కొన్ని నెలలు విరామం తీసుకున్న అతడు ఆరు నెలల కిందట డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గా రూ. 45,000 నెల జీతానికి ఆర్కే ఆసుపత్రిలో చేరాడు. విజయ్ ప్రధానంగా రాత్రిపూట రౌండ్లు నిర్వహించేవాడని, ఇతర వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతున్న రోగులను పరీక్షించేవాడని పోలీసులు తెలిపారు. మిగితా నిందితులకు రూ.6.5 లక్షలు చెల్లించి రష్యాలోని కజాన్ స్టేట్స్ మెడికల్ యూనివర్సిటీలో నకిలీ వైద్య పట్టా పొందినట్లు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది.
వైరల్ వీడియో : విమానంలో తల్లిదండ్రులకు స్వీట్ సర్ ఫ్రైజ్ ఇచ్చిన పైలట్..
హుజూర్ నగర్ కు చెందిన కుమార్ తో తనకు రెండేళ్ల క్రితం, దిల్ సుఖ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పీఆర్వో గా పనిచేస్తున్నస్తుప్పుడు అఫ్రోజ్ తో పరిచయం ఏర్పడిందని విజయ్ తెలిపారు. అలాగే అతడికి నకిలీ మెడికల్ డిగ్రీని అందించిన జునైద్ తో పరిచయం ఏర్పడిందని చెప్పారు. పాస్ పోర్టుపై నకిలీ రష్యన్ ఇమ్మిగ్రేషన్ స్టాంప్ ఇస్తానని కూడా జునైద్ హామీ ఇచ్చాడని, కానీ ఇంకా అది జరగలేదని నిందితుడు తెలిపాడు. అయితే పోలీసులు జునైద్ వద్ద నుండి పాస్ పోర్టు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.