
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టుపై ఏపీలోనే ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ మధుయాష్కీ గౌడ్ కూడా చంద్రబాబు అరెస్టుపై మాట్లాడారు. ఈ అరెస్టు వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు నాయుడిని అరెస్టు చేశారని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి, కమ్మక్కై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి అరెస్టు చేయించారని అన్నారు. ఈ అరెస్టు వెనుక కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సీఎం కేసీఆర్ కు తెలియకుండా ఏమీ చేయబోరని తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే ? గతంలో ప్రధానికి రాసిన లేఖ వైరల్..
ఏపీలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ గెలుపు కోసం సీఎం కేసీఆర్ జగన్ కు సూట్ కేసులు పంపించారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, వైసీపీ ఈ మూడు ఒకటేనని మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. ఈ మూడు రాజకీయ పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. దీనిని రెండు రాష్ట్రాల ప్రజలు గమనించాలని కోరారు.
నాతో పాటు కేటీఆర్ సినిమాకు రావాలి - గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
ఇదిలా ఉండగా.. తమిళనాడుకు చెందిన ఎండీఎంకే పార్టీ నేత వైగో కూడా చంద్రబాబు నాయుడి అరెస్టుపై స్పందించారు. ఆయనకు మద్దతుగా నిలిచారు. చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రతీకార రాజకీయాలకు నిదర్శనం అని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అవసరమైతే చంద్రబాబు నాయుడికి సమన్లు జారీ చేసి, దాని ద్వారా విచారణ జరిపే అవకాశం ఉందని అన్నారు. కానీ అలా చేయలేదని చెప్పారు. ఆయనను ఒక టెర్రరిస్టులా అరెస్టు చేశారని తెలిపారు. ఇది దారుణం అని అన్నారు. చంద్రబాబు నాయుడి అరెస్టు రాజకీయ కారణాలతోనే జరిగిందని తెలిపారు. ఈ విషయంలో జగన్ సంతోషించవ్చని అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిన సేవలను మాత్రం ఎవరూ తెరిపివేయలేరని తెలిపారు. అన్నింటినీ అధిగిమించి టీడీపీ అధినేత జైలు నుంచి బయటకు వస్తారని ఆయన తెలిపారు.