జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు : ఆజారుద్దీన్ సభ.. అడ్డుకున్న విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు

Siva Kodati |  
Published : Aug 09, 2023, 08:38 PM IST
జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు : ఆజారుద్దీన్ సభ.. అడ్డుకున్న విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు

సారాంశం

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.  ఆజారుద్దీన్ ఏర్పాటు చేసిన సభను మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. 

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. రెహమత్ నగర్‌లో సభను ఏర్పాటు చేశారు ఆ పార్టీ నేత ఆజారుద్దీన్. అయితే ఆ సభను పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. విష్ణు నియోజకవర్గంలో కనీసం సమాచారం ఇవ్వకుండా సభను నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నుంచి అసెంబ్లీకి ఆజారుద్దీన్ పోటీ చేస్తారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఏర్పాటు చేసిన సభకు విష్ణువర్గీయులు అడ్డు తలగడంతో ఆజారుద్దీన్ వర్గీయులు వారితో గొడవకు దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్