పెళ్లికి నిరాకరించిందని వివాహిత కొడుకును కిడ్నాప్ చేశాడో యువకుడు. వివాహేతర సంబంధం నెరుపుతూ పెళ్లి చేసుకోమంటే.. తిరస్కరించిందని దారుణానికి తెగబడ్డాడు.
హైదరాబాద్ : పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం లేదని ఓ married woman కుమారుడిని కిడ్నాప్ చేసిన యువకుడిమీద జూబ్లీహిల్స్ పోలీసులు kidnap case నమోదు చేసి చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తెలిపిన మేరకు.. బబ్బుగూడలో నివసించే షేక్ తబస్సుమ్ (24) భర్తతో విడిపోయి ఈవెంట్ ఆర్గనైజనర్ గా రహ్మత్ నగర్ లో పనిచేస్తుంది. ఈమెకు ఇద్దరు కుమారులు. తన ఇంటి సమీపంలోనే నివసించే శంకర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం కాస్త గత మూడు నెలలుగా సహజీవనానికి దారి తీసింది. ఇద్దరూ బబ్బుగూడలో సహజీవనం చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన పెళ్లి చేసుకోవాలంటూ శంకర్ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇందుకు ఆమె అంగీకరించలేదు. దొంగతనాలు చేస్తూ పోలీసులకు కూడా పట్టుబడ్డాట్లు శంకర మీద అభియోగాలు ఉండటంతో పెళ్లికి నిరాకరించింది. కక్ష పెంచుకున్న శంకర్ బాధితురాలు రహ్మత్ నగర్ లో ఓ కార్యక్రమంలో ఉండగా తనతో పాటు వచ్చిన రెండేళ్ల కుమారుడిని ఎత్తికెళ్లినట్లు ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
జూబ్లీహిల్స్ పోలీసులు శంకర్ పై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. నాందేడ్ లో ఉన్నట్లుగా ఫోన్ కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. నాందేడ్ కు ఒక పోలీస్ బృందం గురువారం వెళ్లింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
undefined
జూబ్లీహిల్స్ పబ్ లో మరో అత్యాచారఘటన.. పుట్టినరోజని పార్టీకి పిలిచి యువతిపై...
కాగా, జూన్ 11న సుంకదకట్టెలో యువతిపై Acid attack ఘటన మరువక ముందే… అలాంటి ఘోరం మరొకటి నగరంలో పునరావృతం అయింది. పెళ్లికి నిరాకరించిందని ఓ Marriedపై ఓ వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. కుమారస్వామి లేఔట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ దారుణం చోటు చేసుకుంది. డిసిపి హరీష్ పాండే కథనం మేరకు యాసిడ్ దాడికి గురైన మహిళ కుమారస్వామి లే అవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని Karnataka అగరబత్తి పరిశ్రమలో పనిచేస్తుంది. ఆమెకు వివాహం అయి, ముగ్గురు పిల్లలు ఉండగా భర్తతో విడాకులు తీసుకుంది.
ఇదే పరిశ్రమలో పని చేస్తు భార్యకు దూరంగా ఉన్న అహ్మాద్ కు, మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. వివాహం చేసుకుందామని కోరగా తన కుమారుడు పెద్దవాడయ్యాడనే కారణంతో ఆమె అంగీకరించలేదు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. శుక్రవారం ఉదయం ఆ మహిళ విధులకు వెళ్తుండగా సారక్కి వద్ద అహ్మద్ గొడవపడి యాసిడ్ చల్లి ఉడాయించాడు. కుమారస్వామి లే అవుట్ పోలీసులు బాధితురాలిని వాసన్ ఐకేర్ ఆసుపత్రికి తరలించారు. కుడి కంటికి తీవ్ర గాయం కావడంతో సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కుమారస్వామి లేఔట్ పోలీసులు అహ్మద్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.