సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్ పీ ఎఫ్ పోలీసులు జరిపిన కాల్పల్లో వరంగల్ జిల్లాకు చెందిన దామెర రాకేష్ అనే యువకుడు మరణించినట్టుగా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పలు మీడియా సంస్థలు దామోదర్ మరణించాడని తెలిపాయి. దామోదర్ మృతదేహం గాంధీ ఆసుపత్రి భద్రపర్చారని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి.
హైదరాబాద్: Secunderabad రైల్వే స్టేషన్ లో శుక్రవారం నాడు జరిగిన పోలీసుల కాల్పుల్లో దామెర రాకేష్ అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు Damodara Rakehs ది Warangal జిల్లాగా గుర్తించారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దామెర రాకేష్ మృతదేహాన్ని పోలీసులు భద్రపర్చాయు.. . ఆందోళనకారులను అదుపు చేసేందుకు ఆర్‌పీఎప్ పోలీసులు జరిపిన కాల్పుల్లో రాకే ష్ మరణించాడు. రాకేష్ సోదరి బీఎస్ఎఫ్ లో పనిచేస్తుంది. సోదరి ప్రేరణతోనే రాకేష్ ఆర్మీలో చేరాలని పరితపించేంవాడు.
also read:అగ్నిపథ్‌కి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో ఆందోళన, రైళ్లకు నిప్పు: పోలీసుల కాాల్పులు
undefined
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో శుక్రవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. రైల్వేస్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన ఆర్మీ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్ధులు రైళ్లపై రాళ్లు రువ్వారు. రైళ్లలో ఉన్న ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. రైల్వే పట్టాలపై కూర్చుని ఆందోళనకు దిగారు. రైలు పట్టాలపై నిప్పు పెట్టి ఆందోళనకు దిగారు. రైలు పట్టాలపై కూర్చొని ఆందోళనకారులు ఆందోళన చేస్తుండడంతో రైళ్లను నిలిపివేశారు అధికారులు. మరో వైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట ఉన్న RTC బస్సులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని 1,2,3 4,5,ఫ్లాట్ ఫారాలపైకి చేరుకొన్న వందలాది మంది ఆర్మీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. రైల్వే స్టేషన్ లో నిలిచి ఉన్న రైళ్లపై రాళ్లతో దాడికి దిగారు. రైలు పట్టాల మధ్య చెత్త వేసి నిప్పు పెట్టారు. వందలాది మంది రైలు పట్టాలపై ఆందోళనకు దిగారు.
అగ్నిపథ్ ను రద్దు చేసి గతంలో మాదిరిగా ఆర్మీలో రిక్రూట్ మెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు రైల్వేస్టేషన్ లో నిలిపి ఉన్న రైళ్లను ఆందోళనకారులు దగ్ధం చేశారు. రైల్వేస్టేషన్ లోని స్టాల్స్ ను కూడా ధ్వంసం చేశారు. ప్యాసింజర్ రైళ్లతో పాటు,ఆందోళనకారులు దగ్ధం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని 1,2,3 ఫ్లాట్‌ఫారాల్లో రణరంగా పరిస్థితి మారింది. రైళ్లకు అంటుకున్న మంటలను ఆర్పివేసేందుకు వచ్చిన ఫైరింజన్లపై కూడా ఆందోళనకారులు అడ్డుకున్నారు.
ఆర్మీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్ధులు ఒక్కసారిగా రైల్వే స్టేషన్ లోకి వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు. రైలు పట్టాల మధ్యలో బైక్ లు వేశారు. ఆందోళనకారులు రైళ్లలోకి చేరుకొని రైళ్లపై దాడికి దిగారు. రైళ్లతో పాటు, ఫ్లాట్ పారాలపై ఉన్న ప్రయాణీకులు భయంతో పరుగులు తీశారు. రెండు గంటలకు పైగా ఆందోళనకారులు రైల్వేస్టేషన్లో విధ్వంసానికి పాల్పడ్డారు.
రైల్వేస్టేషన్ లోని పార్శిల్ కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేశారు. పార్శిల్ కార్యాలయంలోని పార్శిళ్లను పట్టాలపై వేసి నిప్పు పెట్టారు. పోలీసులపై కూడా ఆందోళనకారులు దాడికి దిగారు. రైల్వే స్టేషన్ లోని సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వందలాది మంది ప్రయాణీకులు దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇవాళ ఉదయం ఆందోళనకారులు రైల్వే స్టేసన్ లో విధ్వంసానికి పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విధ్వంసానికి పాల్పడ్డారు. సీఆర్‌పీఎఫ్, ఎస్పీఎఫ్, తెలంగాణ పోలీస్ , రైల్వే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రైల్వేస్టేషన్ లోని 10 ఫ్లాట్ ఫారాలున్నాయి. 2,3,4,5 ఫ్లాట్ పారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.