నల్గొండలోని ఫ్రూట్స్ గౌడన్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి..

Published : Jun 26, 2023, 02:43 PM IST
నల్గొండలోని ఫ్రూట్స్ గౌడన్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి..

సారాంశం

నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు బర్కత్ పుర కాలనీ వెటర్నరీ హాస్పిటల్ సమీపంలోని న్యూ స్టార్ ఫ్రూట్స్ గౌడన్‌లో ఏసీ కంప్రెషర్ పేలి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

నల్గొండ జిల్లాలో భారీ పేలుడు చోటచేసుకుంది. నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు బర్కత్ పుర కాలనీ వెటర్నరీ హాస్పిటల్ సమీపంలోని న్యూ స్టార్ ఫ్రూట్స్ గౌడన్‌లో ఏసీ కంప్రెషర్ పేలి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పేలుడు దాటికి వారి మృతదేహాలు ముక్కలు ముక్కలు అయ్యాయి. మృతులను కోల్డ్ స్టోరేజి ఓనర్ షేక్ కలీమ్, అందులో పనిచేసే వ్యక్తి సాజిద్ మృతులుగా గుర్తించారు. అయితే  ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న నలుగురు వ్యక్తులు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టుగా  స్థానికులు చెప్పారు. 

ఈ ఘటనలో ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లినట్టుగా తెలస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నల్గొండ ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, డీఎస్‌పీ నరసింహారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.  ప్రమాదానికి గల  కారణాలపై ఆరా తీశారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ