Belt Shops: బెల్డ్ షాపులకు మూడినట్టేనా? ఎక్సైజ్ శాఖ రైడ్లు.. కాంగ్రెస్ హామీ అమలు చేయనుందా?

By Mahesh K  |  First Published Dec 12, 2023, 10:43 PM IST

తెలంగాణలో త్వరలో బెల్ట్ షాపులకు తెరపడనుందా? కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేసి బెల్ట్ షాపులను మూసేయాలని అనుకుంటున్నదా? ఈ దిశగానే ఎక్సైజ్ శాఖ బెల్ట్ షాపులపై రైడ్లు చేస్తున్నట్టు కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం.
 


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు బెల్ట్ షాపులపై సంచలన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని బెల్ట్ షాపులను మూసేస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే పనిలో ఉన్నట్టూ సంకేతాలు అందుతున్నాయి. రాష్ట్రంలోని బెల్ట్ షాపులను మూసివేతకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అబ్కారీ శాఖ బెల్ట్ షాపులపై రైడ్లు చేస్తున్నట్టు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దూకినట్టు సమాచారం.

లైసెన్స్ ఉన్న వైన్స్ షాపులకు సమీప దూరాల్లో అనధికార రీతిలో లిక్కర్‌ను అమ్మే షాపులను బెల్ట్ షాపులని పిలుస్తుంటారు. ఈ బెల్ట్ షాపులు చాలా సార్లు వైన్స్‌లకు అనుబంధ ఔట్‌లెట్లుగా మారిపోతుంటాయి.

Latest Videos

Also Read: TSPSC: టీఎస్‌పీఎస్‌సీలో ఏం జరుగుతోంది? ఐదుగురు బోర్డు సభ్యుల రాజీనామా.. ‘నేను ఎంతో క్షోభకు గురయ్యా’..

గ్రామాల్లో బెల్ట్ షాపుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మద్యానికి బానిసైన వారికి ఉద్దెరగా లిక్కర్ అమ్మి వారిని మరింత అప్పులో ఊబిలోకి నెడుతున్నట్టు విమర్శలు ఉన్నాయి. గ్రామాల్లో బెల్ట్ షాపులు అప్పులు భారాన్ని పెంచుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. సాధారణంగా ఈ బెల్ట్ షాపులు ఎక్సైజ్ శాఖ నిఘా కింద నడుస్తుంటాయి.

ఈ బెల్ట్ షాపులు అనధికారికమైనవని, వీటిని మూసేయించే బాధ్యత ఎక్సైజ్ శాఖదే అని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. చాలా గ్రామాల్లో జనరల్ స్టోర్‌లలో అనధికార బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, తొందరగా డబ్బు కూడబెట్టుకోవాలనే ఆశతో ఉద్దెరపై లిక్కర్ అమ్మకాలు జరుపుతున్నారని వివరించాయి.

click me!