కండువా మార్చినంత ఈజీగా పార్టీలు మారుతున్నారు : ప్రస్తుత రాజకీయాలపై వెంకయ్య వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Oct 8, 2023, 4:37 PM IST

దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్ధితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.  రాజకీయాల్లో కోట్లు లేనిదే ఓట్లు రావనే పరిస్ధితి ఏర్పడిందన్నారు. రాజకీయాల్లో రాణించడానికి బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదని.. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయాలని వెంకయ్య నాయుడు తెలిపారు. 


దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్ధితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలలో నిర్వహించిన సిటిజన్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో కోట్లు లేనిదే ఓట్లు రావనే పరిస్ధితి ఏర్పడిందన్నారు.

ఓ వ్యక్తి పార్టీ మారితే ఆ పార్టీలో వుండగా వచ్చిన పదవికి సైతం రాజీనామా చేయాలని ఆయన అన్నారు. యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం వుందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి చేసే రాజకీయాల వల్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో రాణించడానికి బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదని.. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయాలని వెంకయ్య నాయుడు తెలిపారు. 

Latest Videos

Also Read: జ‌మిలి ఎన్నిక‌లు, దేశం పేరు మార్పుపై వెంకయ్య నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు

ఇదిలావుండగా జమిలి ఎన్నికలపై వెంకయ్య నాయుడు ఇటీవల తన స్పందనను తెలియజేశారు. ఇండియా పేరును భారత్ గా మార్చడంలో తప్పేమీ లేదనీ, దేశాన్ని ఎప్పటి నుంచో భారత్ అని పిలుస్తున్నారని మాజీ ఉపరాష్ట్రపతి అన్నారు. అయితే పార్లమెంటులో సమగ్రంగా చర్చించి, అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఈ రెండు నిర్ణయాలను అమలు చేయాలని ఆయన అన్నారు. భద్రతా బలగాల మోహరింపు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.తరచూ ఎన్నికలు జరగడం వల్ల దేశంలో అభివృద్ధి కుంటుపడుతుందనీ, 'ఒకే దేశం- ఒకే ఎన్నికలు' ఆలోచనకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మద్దతు పలికారు.

ప‌లువురు విలేకరుల బృందంతో అనధికారిక చాట్ లో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో ఈ పేర్లను ప్రస్తావించినందున 'ఇండియా', 'భారత్' పరస్పరం మార్చుకోదగినవని అన్నారు. దేశంలో 1971 వరకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయ‌నీ, కానీ ఆ తర్వాత 1972లో జరిగిన ముందస్తు ఎన్నికల వల్ల ఈ చక్రం దెబ్బతిందని గుర్తు చేశారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, లా కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేశాయ‌ని గుర్తుచేశారు. సాధారణ ప్రజలు కూడా ఈ ప్రతిపాదనను స్వాగతించారని తెలిపారు. భద్రతా బలగాల మోహరింపు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, లా కమిషన్, ఎలక్షన్ కమిషన్ సిఫారసుల మేరకే నడుచుకోవాలని వ్యక్తిగతంగా తాను భావిస్తున్నాన‌ని అన్నారు. లోక్ సభ, అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని అన్నారు. రాజకీయ నాయకులు తమ విధేయతను మార్చుకునే ధోరణిని ప్రస్తావిస్తూ, "ప్రస్తుతం ఉన్న ఫిరాయింపుల నిరోధక చట్టాలను సవరించడం ద్వారా ఫిరాయింపుల సమస్యను పరిష్కరించవచ్చు. ఒక పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత మరో పార్టీలో చేరాలనుకుంటే ముందుగా తాను ఎన్నుకున్న పదవికి రాజీనామా చేయాలని" అన్నారు.

click me!