కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దు.. దేశం తెలంగాణ వైపు చూస్తోంది.. : మంత్రి మహేందర్ రెడ్డి

Published : Oct 08, 2023, 03:52 PM IST
కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దు.. దేశం తెలంగాణ వైపు చూస్తోంది.. : మంత్రి మహేందర్ రెడ్డి

సారాంశం

Chevella Assembly constituency: ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) నేతృత్వంలో రాష్ట్రంలో మెరుగైన పాల‌న కొన‌సాగుతున్న‌ద‌నీ,  తెలంగాణ‌లో వేలకోట్లతో అభివృద్ధి సాగుతుందని సమాచార, పౌర సంబంధా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు సైతం అలానే అమలవుతున్నాయని పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను ఖండిస్తూ.. 24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో ఉందని రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు ఎక్కడున్నాయని మంత్రి ప్రశ్నించారు.  

Minister Mahender Reddy: తెలంగాణ అభివృద్ధితో యావ‌త్ భార‌తావ‌ని రాష్ట్రంవైపు చూస్తున్న‌ద‌ని సమాచార, పౌర సంబంధాల‌ శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) నేతృత్వంలో రాష్ట్రంలో మెరుగైన పాల‌న కొన‌సాగుతున్న‌ద‌నీ,  తెలంగాణ‌లో వేలకోట్లతో అభివృద్ధి సాగుతుందని సమాచార, పౌర సంబంధా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు సైతం అలానే అమలవుతున్నాయని పేర్కొన్నారు.  ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను ఖండిస్తూ.. 24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో ఉందని రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు ఎక్కడున్నాయని మంత్రి ప్రశ్నించారు.

వివ‌రాల్లోకెళ్తే.. చేవెళ్ల నియోజకవర్గం లో రూ. 21.49 కోట్ల అభివృద్ధి పనులను మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్, బీజేపీల పథకాలను నమ్మొద్దని అన్నారు. తెలంగాణా పథకాలను దేశంలోని కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో కాపీ కొడుతున్నారన్నార‌ని ఎత్తిచూపారు. దేశం తెలంగాణా వైపు చూస్తుంటే... ప్రతిపక్షాలు విమ్శిస్తున్నాయని మండిప‌డ్డారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా నిలుస్తుందని చెప్పారు. ఎన్నికల అప్పుడే గ్రామాల్లో తిరుగుతూ తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలను ప్రజలు నమ్మరని అన్నారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో  వేలకోట్లతో అభివృద్ధి సాగుతుందనీ, సంక్షేమ పథకాలు సైతం అలానే అమలవుతున్నాయని వెల్లడించారు. 24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో ఉందని రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు ఎక్కడున్నాయని మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరు ఎంత ప్రయత్నించినా ప్రజలు సీఎం కేసీఆర్ ను మరో మారు దీవిస్తారనీ, ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి ధీమా వ్య‌క్తంచేశారు. ఎమ్మెల్యేగా యాదయ్యను, ఎంపీగా రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మహేందర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సాగుతుందని చెప్పారు. వ్యక్తిగత పథకాలు పేదరిక నిర్మూలనకు తోడ్పడుతాయని చెప్పారు. ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గం అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాగుతుందని అందుకు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు మరో మారు తనను దీవించాలని కోరారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu
Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?