రాజ్యాంగ పదవిలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలి.. గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

Published : Jan 30, 2023, 11:41 AM ISTUpdated : Feb 02, 2023, 03:56 PM IST
 రాజ్యాంగ పదవిలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలి.. గుత్తా సుఖేందర్ రెడ్డి  కీలక వ్యాఖ్యలు..

సారాంశం

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌ల మధ్య బడ్జెట్ విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌ల మధ్య బడ్జెట్ విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫెడరల్ వ్యవస్థ, లౌకిక విధానాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు రాజ్యాంగానికి ఆటంకాలు  కలిగిస్తున్నాయని చెప్పారు. కొందరు వక్రబుద్దితో రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పదవిలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. శాసనసభ, శాసన మండలి, గవర్నర్ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని చెప్పుకొచ్చారు. బడ్జెట్ ఆమోదంపై అన్ని సర్దుకుంటాయని  ఆశిస్తున్నట్టుగా చెప్పారు.

ఇదిలా ఉంటే..  తెలంగాణ గవర్నర్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. బడ్జెట్‌ ఫైల్‌కు గవర్నర్ ఆమోదం లభించకపోవడంపై హైకోర్టు‌లో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం లంచ్‌ మోషన్ పిటిషన్‌ దాఖలు చేసింది.  బడ్జెట్‌ను ఆమోదించేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరింది. అయితే ఈ లంచ్‌ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు అనుతించింది. ఈ రోజు ఉదయం హైకోర్టులో బడ్జెట్ వివాదంపై ప్రభుత్వం లంచ్ మోహన్‌ పిటిషన్ దాఖలు చేయనున్నట్టుగా అడ్వొకేట్ జనరల్ తెలిపారు. గవర్నర్ బడ్జెట్ ఫైల్‌కు ఆమోదం తెలుపలేదని చెప్పారు. 

Also Read: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందా?.. ప్రభుత్వానికి రాజ్‌భవన్ నుంచి రిప్లై..!

గవర్నర్ ఆమోదం లభించకపోతే.. అసెంబ్లీ ప్రవేశపెట్టేందుకు వీలు ఉండదని చెప్పారు. ఈ క్రమంలోనే స్పందించిన హైకోర్టు.. ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య జరుగుతున్న ఈ విషయంలో తామేలా జోక్యం చేసుకుంటామని ప్రశ్నించింది. బడ్జెట్‌కు ఆమోదం  లభించకపోతే.. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఏజీ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైకోర్టు లంచ్‌మోషన్ పిటిషన్‌ను అనుమతించింది. మధ్యాహ్నం ఒంటి గంటకు విచారించనున్నట్టుగా తెలిపింది. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్