టీపీసీసీ రేసులో నేనూ ఉన్నానంటున్న మధుయాష్కీ..

By AN TeluguFirst Published Jun 7, 2021, 3:58 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర పీసీసీ(టీపీసీసీ) అధ్యక్షుడి రేసులో తాను కూడా ఉన్నానని నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలోనే పీసీసీ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన కసరత్తు ఢిల్లీలో మొదలైందని తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర పీసీసీ(టీపీసీసీ) అధ్యక్షుడి రేసులో తాను కూడా ఉన్నానని నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలోనే పీసీసీ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన కసరత్తు ఢిల్లీలో మొదలైందని తెలిపారు. 

కానీ అందరూ ఊహించినట్టుగా అది ట్వింటీ ట్వంటీ స్థాయిలో లేదని ఆయన పేర్కొన్నారు. పీసీసీ పగ్గాలను బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలని కోరుతున్నామని ఆయన అన్నారు. 

అంతేకాదు ఆస్తుల రక్షణ కోసమే ఈటెల బీజేపీలోకి వెడుతున్నారని మధుయాష్కీ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని ఆయన విమర్శించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే బీజేపీ మీద కేటీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. 

కాగా, టీపీసీసీకి కొత్త నాయకత్వం ఎంపిక కోసం పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ కోరాడు. పీసీసీ చీఫ్ పదవికి ఇప్పటికే అభిప్రాయాలు సేకరించిన ఠాగూర్  సోనియాగాంధీకి నివేదికను అందించనున్నారు. 

అయితే తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ నాయకత్వాన్ని కోరారు తాను కూడ పీసీసీ చీఫ్ రేసులో ఉన్నానని ఆయన ప్రకటించారు. 

పీసీసీ చీఫ్ పదవి ఇస్తే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని జగ్గారెడ్డి చెప్పారు.  పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో  అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని  ఆయన డిమాండ్ చేశారు. తాను వ్యతిరేకిస్తున్న వ్యక్తులకు పీసీసీ చీఫ్ పదవి రాకూడదనే ఉద్దేశ్యంతోనే జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ కూడ లేకపోలేదు. 

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆయన జైలుకు వెళ్తే ఎలా అని మరో నేత వి. హనుమంతరావు ప్రశ్నించారు. పార్టీ మొత్తం జైలు చుట్టూ తిరగాలా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వొద్దని హనుమంతరావు  బహిరంగంగానే డిమాండ్ చేశారు. రేవంత్ పై కేసులతో పాటు ఇతర అంశాలను కూడ ఆయన గతంలోనే లేవనెత్తారు.  

ఈ విషయమై మాట్లాడినందుకు తనకు బెదిరింపులు వస్తున్నాయన్నారు.  పీసీసీ చీఫ్ పదవి కోసం నేతలు మరోసారి ప్రయత్నాలను మొదలు పెట్టారు.  తమకు ఈ పదవి దక్కకపోయినా సరే తమ ప్రత్యర్ధులకు  ఈ పదవి రావొద్దనే లక్ష్యంతో  ముందుకు సాగుతున్నారు. 

click me!