వెళ్లిపోయినవారు మళ్లీ వస్తామంటున్నారు.. జాగ్రత్త, షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే : మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jun 24, 2023, 06:52 PM IST
వెళ్లిపోయినవారు మళ్లీ వస్తామంటున్నారు.. జాగ్రత్త, షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే : మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వైఎస్ షర్మిలలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ స్పందించారు. పార్టీలోకి ఎవరు వచ్చినా అలాంటి వారి విషయంలో స్థానిక నాయకులతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.  

కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల రానున్నారనే వార్తలతో గత కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాలు హీటెక్కిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతలతో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ థాక్రే చేసిన వ్యాఖ్యలు మరింత కాకపుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ స్పందించారు. కాంగ్రెస్‌ను వీడిని వారు తిరిగి పార్టీలో చేరుతామని వస్తే అలాంటి వారి విషయంలో అలర్ట్‌గా వుండాలని వ్యాఖ్యానించారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి చేరితే.. ఆయన కాంట్రాక్టుల కోసం వస్తున్నారా అంటూ మధుయాష్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి ఎవరు వచ్చినా అలాంటి వారి విషయంలో స్థానిక నాయకులతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. లేనిపక్షంలో పార్టీ కోసం తీవ్రంగా శ్రమించిన వారికి అన్యాయం జరుగుతుందని మధుయాష్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో వైఎస్ షర్మిల గురించి మాట్లాడుతూ.. ఆమె కాంగ్రెస్‌లోకి వస్తే మంచిదేనన్నారు. వాస్తవానికి షర్మిల కాంగ్రెస్ కుటుంబమేనన్నారు. బీఆర్ఎస్, బీజేపీల కుట్రలు గ్రహించాలని మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ALso Read: షర్మిలతో టచ్‌లోనే హైకమాండ్ .. కాంగ్రెస్‌లో చేరితే ఏపీకే : మాణిక్‌రావు థాక్రే సంచలన వ్యాఖ్యలు

కాగా.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలతో హైకమాండ్ టచ్‌లో వుందన్నారు. షర్మిల వస్తే ఏపీ కాంగ్రెస్‌కు ఎంతో లాభమని థాక్రే వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ముందుగానే అభ్యర్ధులను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. రెండు దశల్లో అభ్యర్ధుల జాబితాను వెల్లడిస్తామని.. బీఆర్ఎస్, బీజేపీల నుంచి రానున్న కాలంలో కాంగ్రెస్‌లోకి చేరికలుంటాయని మాణిక్‌రావు థాక్రే పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క గట్టిగా పోరాడుతున్నారని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా భట్టి విక్రమార్క పాదయాత్ర పార్టీకి చాలా దోహదం చేస్తోందన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ షర్మిల స్పందించారు. తన చివరి శ్వాస వరు తెలంగాణ బిడ్డగా.. తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటారని ఆమె పేర్కొన్నారు. అంతేకానీ, ఊహాజనిత కథనలు కల్పిస్తూ, ఆమెకు, తెలంగాణ ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించే విఫల ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అంతేకాదు, పని లేని, పస లేని దార్శనికులు అని పేర్కొంటూ.. తన రాజకీయ భవిష్యత్ మీద దృష్టి పెట్టే బదులు.. కేసీఆర్ పాలనలో నాశనమైపోతున్న తెలంగాణ భవిత మీద దృష్టి పెట్టాలని సూచించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిని ఎండగట్టాలని పేర్కొన్నారు. తన భవిష్యత్ తెలంగాణతోనే అని, తన ఆరాటం, తన పోరాటం తెలంగాణ కోసమే అని.. జై తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?