అన్న పిలుపు... రక్తదానం చేసిన మాజీ ఎంపీ కవిత

Siva Kodati |  
Published : May 01, 2020, 05:56 PM ISTUpdated : May 01, 2020, 06:11 PM IST
అన్న పిలుపు... రక్తదానం చేసిన మాజీ ఎంపీ కవిత

సారాంశం

అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని.. యువత రక్తదానం చేసి ఆపదలో వున్నవారిని ఆదుకోవాలని టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు

అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని.. యువత రక్తదానం చేసి ఆపదలో వున్నవారిని ఆదుకోవాలని టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కవిత ముందుకొచ్చారు.

 

 

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తన నివాసంలో రక్తదానం చేశారు. అత్యవసర పరిస్ధితుల్లో వున్న వారిని రక్తదానం కాపాడుతోందని కవిత అన్నారు. తలసేమియా, ఇతర అత్యవసర చికిత్సలకు సాయం అందించడానికి తాను రక్తదానం చేసినట్లు ఆమె స్పష్టం చేశారు.

సమాజసేవలో ఎల్లప్పుడూ ముందుండే టీఆర్ఎస్ కార్యకర్తలు, వీలైనంత ఎక్కువగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని కవిత పిలుపునిచ్చారు. కేటీఆర్ సైతం తలసేమియా, ఇతర అత్యవసర చికిత్సలకు సాయం అందించడానికి రక్తదానం చేసినట్లు వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం