హెల్త్ ప్రొఫైల్స్ ఆధారంగా విధులు: తెలంగాణ పోలీస్ శాఖ ప్లాన్

By narsimha lode  |  First Published May 1, 2020, 1:52 PM IST

 తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ను తయారు చేస్తున్నారు. హోంగార్డు నుండి డీజీపీ వరకు ప్రొఫైల్ ను సిద్దం చేస్తున్నారు. ఇప్పటి వరకు 25 వేల మందికి సంబంధించిన ప్రొఫైల్స్ సిద్దం చేశారు.
 



హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ను తయారు చేస్తున్నారు. హోంగార్డు నుండి డీజీపీ వరకు ప్రొఫైల్ ను సిద్దం చేస్తున్నారు. ఇప్పటి వరకు 25 వేల మందికి సంబంధించిన ప్రొఫైల్స్ సిద్దం చేశారు.

పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని  విధులను కేటాయించాలని పోలీస్ శాఖ భావిస్తోంది. మరో రెండు రోజుల్లో ప్రొఫైల్ సేకరణ పూర్తి చేసేందుకు  పోలీస్ శాఖ సిద్దమైంది.

Latest Videos

undefined

also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: హైద్రాబాద్ నుండి జార్ఖండ్ కు వలస కూలీలతో ప్రత్యేక రైలు

ఈ హెల్త్ ప్రొఫైల్స్ ను ఆరోగ్య భద్రతకు లింక్ చేస్తున్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్  ఆధారంగా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అవసరమైన వైద్య సహాయం అందించాలని పోలీస్ శాఖ భావిస్తోంది.

ఈ హెల్త్ ప్రొఫైల్ ఆధారంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడే పోలీసులకు ట్రాఫిక్ విధుల నుండి తప్పించనున్నారు. ఆరోగ్య సమస్యలు లేకపోతే ట్రాఫిక్ తో పాటు ఇతర విధులను కేటాయించే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఉంటే స్టేషన్లకే పరిమితమయ్యే విధులను కేటాయించాలని పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేసేందుకు తెలంగాణ పోలీస్ శాఖ భావిస్తోంది.

click me!