విజయశాంతి పోటీ చేసేది ఎక్కడ నుంచి అంటే...

Published : Sep 29, 2018, 08:51 PM IST
విజయశాంతి పోటీ చేసేది ఎక్కడ నుంచి అంటే...

సారాంశం

ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్, ప్రచార కమిటీ సలహాదారు విజయశాంతి తన మనసులో మాట బయటపెట్టారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదని స్పష్టం చేశారు. స్టార్ కాంపైనర్ గా తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేస్తానని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు.   


హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్, ప్రచార కమిటీ సలహాదారు విజయశాంతి తన మనసులో మాట బయటపెట్టారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదని స్పష్టం చేశారు. స్టార్ కాంపైనర్ గా తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేస్తానని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. 

ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక నియోజకవర్గానికే పరిమితం అవుతానని అందువల్లే పోటీ చెయ్యకూడదని నిర్ణయించుకున్నానని ఈ విషయం పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తెలియజేసినట్లు చెప్పారు. ప్రస్తుతం తన దృష్టి అంతా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంపైనేననన్నారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్నిఇచ్చారని...రాహుల్ గాంధీ తనను స్టార్ కాంపైనర్ గా నియమించారని తెలిపారు. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని రాములమ్మ తెలిపారు. అయితే ఎక్కడ నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానో అన్నది వారం రోజుల్లో స్పష్టం చేస్తానని తెలిపారు. మరోవైపు మహాకూటమిపై తన అభిప్రాయాన్ని రాహుల్ గాంధీకి చెప్పినట్లు తెలిపారు. టీడీపీతో పొత్తుపై తన వైఖరిని రాహుల్ గాంధీకి స్పష్టం చేసినట్లు విజయశాంతి తెలిపారు.   

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ