తప్పు చేస్తే జైలుకెళ్లాల్సిందే : రేవంత్ పై జగదీశ్ రెడ్డి

By Nagaraju TFirst Published Sep 29, 2018, 6:33 PM IST
Highlights

వంత్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అసహనంతో టీఆర్ఎస్ పార్టీపై అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐటీ దాడులు అనేవి సహజంగా జరుగుతాయని వాటిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 

హైదరాబాద్: రేవంత్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అసహనంతో టీఆర్ఎస్ పార్టీపై అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐటీ దాడులు అనేవి సహజంగా జరుగుతాయని వాటిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రేవంత్ రెడ్డి అక్రమంగా సంపాదించారో ఆస్తుల వివరాలేంటో ఐటీ శాఖ అధికారులే బయటపెడతారని తెలిపారు. 

దేశంలో వేలాదిమందిపై ఐటీ శాఖ దాడులు చేశాయని, ఇన్ కం ట్యాక్స్ ఎగ్గొట్టిన వాళ్లకు ఫైన్ కూడా వేసిన సంగతులు కోకొల్లలన్నారు. అయితే రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ సోదాలను బూచిగా చూపి కాంగ్రెస్ పార్టీ ఓట్లు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏనాడు రేవంత్ రెడ్డి ఆస్తులపై మాట్లాడిన పరిస్థితి లేదన్నారు. 

రేవంత్ రెడ్డి ఆస్తులు సక్రమంగా ఉంటే ఆయన జైలుకెళ్లరని..ఒకవేళ తప్పు చేస్తే జైలు కెళ్లాల్సి ఉంటుందని అందులో తప్పించుకోలేరన్నారు. అంతేకానీ టీఆర్ఎస్ పార్టీపైనా కేసీఆర్ పైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోరని తెలిపారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రతీ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని మండిపడ్డారు. 
 

click me!