కేసీఆర్ సమక్షంలో..టీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి

Published : Nov 20, 2018, 03:17 PM ISTUpdated : Nov 20, 2018, 03:24 PM IST
కేసీఆర్ సమక్షంలో..టీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి

సారాంశం

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చెరుకు ముత్యం రెడ్డి కాంగ్రెస్ కి ఊహించని షాక్ ఇచ్చారు

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చెరుకు ముత్యం రెడ్డి కాంగ్రెస్ కి ఊహించని షాక్ ఇచ్చారు. గత కొంతకాలంగా ఆయన టీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. కాగా.. మంగళవారం ఆయన సిద్ధిపేటలో  టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో కారు ఎక్కారు.

దుబ్బాక మాజీ ఎమ్మెల్యే అయిన ముత్యం రెడ్డి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపు నుంచి తన కొడుకు కి టికెట్ ఆశించారు. అయితే.. కాంగ్రెస్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. మహాకూటమిలో భాగంగా ఆ టికెట్ టీజేఎస్ కి దక్కింది. దీంతో ఆయన కన్నీటి పర్యంతం కూడా అయ్యారు.

ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్  పార్టీ చేస్తున్నప్పటికీ తనకు గుర్తింపు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధిపేట వచ్చిన కేసీఆర్ సమక్షంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. 

కాంగ్రెస్‌కు షాక్: టీఆర్ఎస్‌లో చేరనున్న చెరుకు ముత్యం రెడ్డి

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌