బీఆర్ఎస్ సీనియర్ నేత, వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. వరంగల్ ఎంపీ టిక్కెట్ ఆయనకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. గతేడాది చివరిలో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆ పార్టీ.. అప్పటి నుంచి ఒడిదొడుగులు ఎదుర్కొంటోంది. ఆ పార్టీని కీలక నేతల, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతున్నారు. తాజాగా వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. ఆయన కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
సిద్దూ మూస్ వాలాకు సోదరుడొచ్చాడు.. మగబిడ్డకు స్వాగతం పలికిన తల్లిదండ్రులు..
బీఆర్ఎస్ లో ఆయన సీనియర్ నేతగా ఉన్నారు. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) తరుఫున వర్థనపేట నుంచి విజయం సాధించారు. 2018లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో కూడా ఆయన గెలుపొందారు. అయితే 2023 చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో పరాజయం పొందారు.
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే గారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన బిజెపి తెలంగాణ అధ్యక్షులు, కేంద్ర మంత్రి శ్రీ గారు pic.twitter.com/F3O8BgyKbl
— BJP Telangana (@BJP4Telangana)ఎస్టీ రిజర్వ్డ్ అయిన వరంగల్ లోక్ సభ స్థానం నుంచి ఆరూరి బరిలో నిలవాలని భావించారు. కానీ బీఆర్ఎస్ నుంచి కాకుండా బీజేపీలో చేరాలని భావించారు. వాస్తవానికి ఆయన ఈ నెల 13వ తేదీనే బీజేపీలో చేరబోతున్నానని ప్రెస్ మీట్ నిర్వహించి చెప్పాలని అనుకున్నారు. కానీ ఈ విషయం బీఆర్ఎస్ హైకమాండ్ కు తెలియడంతో ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. ఆ సమయంలో కాస్తా నాటకీయ పరిణామాలే చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
టీడీపీ-బీజేపీ- జనసేన పొత్తు,చిలకలూరిపేటలో ప్రజాగళం సభ: మోడీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
ఆరూరి రమేష్ ను బీఆర్ఎస్ నేతలు బలవంతంగా వరంగల్ నుంచి హైదరాబాద్ కు తీసుకెళ్లారు. అయితే ఆ కారును బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆరూరి చొక్కా కూడా చిరిగిపోయింది. ఓ దశలో ఆయన కంట తడి పెట్టుకున్నారు. తరువాత హైదరాబాద్ లోని నందినగర్ నివాసానికి వెళ్లి మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు. పార్టీ మారొద్దని, భవిష్యత్ పాడు చేసుకోవద్దని కేసీఆర్ సూచించారు. అప్పటికి వెనక్కి తగ్గిన ఆరూరి తాజాగా బీజేపీలో చేరారు.