కేసీఆర్‌పై వ్యూహాత్మకంగానే.. జనంలోకి ఈటల, రేపటి నుంచి ఇంటింటి ప్రచారం

Siva Kodati |  
Published : Jun 17, 2021, 08:08 PM IST
కేసీఆర్‌పై వ్యూహాత్మకంగానే.. జనంలోకి ఈటల, రేపటి నుంచి ఇంటింటి ప్రచారం

సారాంశం

హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు అన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. కేసీఆర్ అహంకారానికి హుజురాబాద్ ప్రజలు ఘోరీ కడతారని ఆయన జోస్యం చెప్పారు. రేపటి నుంచి హుజురాబాద్‌లో ఇంటింటి ప్రచారం చేస్తానని ఈటల స్పష్టం చేశారు.

హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు అన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. కేసీఆర్ అహంకారానికి హుజురాబాద్ ప్రజలు ఘోరీ కడతారని ఆయన జోస్యం చెప్పారు. రేపటి నుంచి హుజురాబాద్‌లో ఇంటింటి ప్రచారం చేస్తానని ఈటల స్పష్టం చేశారు. రాచరికాన్ని బొంద పెట్టేందుకు హుజురాబాద్ ప్రజలు ఎదురుచూస్తున్నారని రాజేందర్ అన్నారు.

బీజేపీలో చేరిన తర్వాత ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్, జమ్మికుంట మండలాల్లోని పలు గ్రామాల్లో ఈటల పర్యటించారు. ఈ సొంత మండలం కమలాపూర్‌లోని శనిగరం, గోపాలపూర్ ప్రజలు, అనుచరులతో రాజేందర్ సమావేశమయ్యారు. ఆరుసార్లు ఎన్నికలు వస్తే అన్ని సార్లు తనను హుజురాబాద్ ప్రజలు గెలిపించారని ఆయన గుర్తుచేశారు.

Also Read:హుజూరాబాద్ బైపోల్: ఆ మూడు పార్టీలకు చావో రేవో

ప్రతి గ్రామంలో తనకు ఆశీర్వాదాలు అందాయని.. కేసీఆర్‌కు బుద్ధి చెబుతామని జనమే అంటున్నారని ఆయన అన్నారు. ప్రజలు ప్రేమకు లొంగుతారు కాదని, ప్రగల్బాలకు కాదని ఈటల పేర్కొన్నారు. ప్రగతి భవన్‌లో రాసిస్తే చదివే మంత్రులు, కుటుంబాల్లో ఎంత బాధపడుతున్నారో తెలిసుకోవాలని సూచించారు. 

PREV
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu