అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చూడండి: గవర్నర్ ను కోరిన బీజేపీ నేతలు

By rajesh yFirst Published 6, Sep 2018, 6:40 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం రద్దు అయిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ముందస్తు ఎన్నికలు అప్రజాస్వామ్యం అని గవర్నర్ దగ్గర బీజేపీ నేతలు వాపోయారు. కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేయ్యడం ఆమోదించడం జరిగిందని అయితే ఆపధర్మ ప్రభుత్వం కొనసాగవచ్చా అని గవర్నర్ తో చర్చించారు. 

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రద్దు అయిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ముందస్తు ఎన్నికలు అప్రజాస్వామ్యం అని గవర్నర్ దగ్గర బీజేపీ నేతలు వాపోయారు. కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేయ్యడం ఆమోదించడం జరిగిందని అయితే ఆపధర్మ ప్రభుత్వం కొనసాగవచ్చా అని గవర్నర్ తో చర్చించారు. 

ఆపధర్మ ప్రభుత్వం అంటే 90 రోజులో వందరోజులు చూశామని 8నెలలు పాటు ఆపధర్మ ప్రభుత్వం ఉండొచ్చా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. సీఎంగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలంటూ అధికారులపై ఒత్తిడి తేకుండా చూడాలని కోరారు. 

ఆపధర్మ ప్రభుత్వం ఎప్పటి వరకు ఉండాలి...ఎలా ఉంటుంది అన్న అంశాలపై అధ్యయనం చేస్తున్నట్లు గవర్నర్ నరసింహన్ స్పష్టం చేసినట్లు కేంద్రమాజీ మంత్రి దత్తాత్రేయ తెలిపారు. ఆపధర్మ ప్రభుత్వంలో ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చర్యలు తీసుకుంటామని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు. 

Last Updated 9, Sep 2018, 12:02 PM IST