కేసీఆర్ కుటుంబం వర్సెస్ తెలంగాణ ప్రజలు మధ్యే పోటీ :షబ్బీర్ అలీ

By rajesh yFirst Published Sep 6, 2018, 6:47 PM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణాను దోచుకుతిన్న వ్యక్తి కేసీఆర్ అంటూ ఆరోపించారు. కేసీఆర్ చేసేది ఒకటి చెప్పేది ఒకటని కేసీఆర్ వ్యవహారం చూస్తుంటే పిట్టల దొర మాదిరిగా ఉందని ఎద్దేశా చేశారు. కేసీఆర్ చాలా అహంకారంతో ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణాను దోచుకుతిన్న వ్యక్తి కేసీఆర్ అంటూ ఆరోపించారు. కేసీఆర్ చేసేది ఒకటి చెప్పేది ఒకటని కేసీఆర్ వ్యవహారం చూస్తుంటే పిట్టల దొర మాదిరిగా ఉందని ఎద్దేశా చేశారు. కేసీఆర్ చాలా అహంకారంతో ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు.

తెలంగాణకు ఏం చేశారో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేనిఫేస్టోలో ఇచ్చిన హాలను అమలు చెయ్యడంలో విఫలమయ్యారని దుయ్యబుట్టారు. ప్రతీ ఇంటికి కుళాయి ఇస్తేనే ఓట్లు అడుగతానన్న కేసీఆర్ ఇప్పుడు ఎలా అడుగతారని ప్రశ్నించారు. కాకి లెక్కలు చెప్పి కేసీఆర్ ఎన్నికలకు పోతున్నారని ఆరోపించారు.  

మరోవైపు తెలంగాణ ఇచ్చిన యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటాన్ని షబ్బీర్ అలీ ఖండించారు. ఢిల్లీలో సోనియాగాంధీ కాళ్లు పట్టుకుంది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఇదే అసెంబ్లీ కౌన్సిల్ లో తెలంగాణ ఉన్నంత వరకు సోనియా గాంధీ కుటుంబాన్ని మరచిపోకూడదని చెప్పింది కేసీఆర్ కాదా అని అన్నారు.   
రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ప్రజల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రాబోయే ఎన్నికలు కేసీఆర్ కుటుంబ అహంకారం, తెలంగాణ ప్రజలు మధ్య జరగనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం ఆస్తుల చిట్టా విప్పుతామని షబ్బీర్ అలీ హెచ్చరించారు. 

అధికారంలోకి వచ్చిన కేసీఆర్, కేటీఆర్ ,కవితలు ఎంత సంపాదించారో ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఇంట్లో ఉండరని జైల్లో ఉంటారని అభిప్రాయపడ్డారు.  

click me!