కాంగ్రెస్‌కు మరో బిగ్‌ షాక్...పార్టీని వీడనున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి

By Arun Kumar PFirst Published Mar 24, 2019, 2:55 PM IST
Highlights

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ములిగే నక్కపై తాటిపండు పడ్డట్లు తయారయ్యింది. ఇప్పటికే ఎమ్మెల్సీ  ఎన్నికల్లో ప్రారంభమైన ఎమ్మెల్యేల వలసలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీటిని అడ్డుకోలేక ఆ పార్టీ అధినాయకత్వం, రాష్ట్ర నాయకులు చేతులెత్తేశారు. ఇలా   గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఆ పార్టీకి అండగా వుండాల్సిన సీనియర్లు కూడా ఒక్కొక్కరుగా వీడుతుండటం టిపిసిసి నాయకులు, కార్యకర్తలకు మరింత ఆందోళన కల్గిస్తోంది. ఇలా మహబూబ్ నగర్ మాజీ మంత్రి ఒకరు తాజాగా కాంగ్రెస్ వీడనున్నట్లు ప్రకటించి మరో షాక్ ఇచ్చారు.  
 
మహబూబ్ నగర్ కు చెందిన మాజీ మంత్రి పొడపాటి చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ ను వీడనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాసమస్యలను పట్టించుకోకుండా కేవలం రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ స్థాయికి దిగజారిందని  విమర్శించారు. కేవలం డబ్బు, గ్రూపు రాజకీయాలే కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా,  అనేక శాఖలకు మంత్రిగా వ్యవహరించిన తనలాంటి సీనియర్లను వినియోగించుకోవడంలో కాంగ్రెస్‌ నాయకత్వం పూర్తిగా విఫలమైందని...అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రశేఖర్ వివరించారు.   

మహబూబ్ నగర్ జిల్లాలో ఇండిపెండెంట్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన చంద్రశేఖర్ మొట్టమొదట పురపాలక సంఘ కౌన్సిలర్ గా గెలుపొందారు. ఆ తర్వాత  1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశంలో చేరారు. ఇలా మొదటిసారి ఆ పార్టీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుండి పోటీ చేసి గెలుపొంది ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం పెంచుకుని కార్పోరేషన్ పదవి పొందారు. ఆ తర్వాత కీలకమైన మంత్రి పదవులను పొందారు. ఇలా ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు మంత్రిమండలిలో కూడా పనిచేశారు. 1983 లో టూరిజం మంత్రిగా, 1984లో న్యాయశాఖ, 1994 లో రవాణా  శాఖ, 1998లో చిన్న, మధ్య తరహా నీటిపారుదల మంత్రిగా ఆయన పనిచేశారు. 

ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2013 లో టీఆర్ఎస్ పార్టీలో చేరి మహబూబ్ నగర్ అసెంబ్లీ నుండి పోటీకి ఆసక్తి చూపించారు. అయితే టీఆర్ఎస్ ఆయనకు సీటు నిరాకరించడంతో ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుండి కాంగ్రెస్ లోను కొనసాగుతున్న ఆయన తాజాగా ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తాను ఏ పార్టీలోనూ చేరకుండా తటస్థంగా ఉంటానని చంద్రశేఖర్ ప్రకటించారు.  
 
click me!